Petrol Price: ఇక ఈ పెట్రోల్ ధరలకు కళ్లెం పడదా..? దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్స్.
Petrol And Diesel Price: పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెట్రోల్, డీజిల్ పరుగులు దూసుకుపోతున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం...
Petrol And Diesel Price: పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు పెట్రోల్, డీజిల్ పరుగులు దూసుకుపోతున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేవు. ఇప్పటికే వంద దాటేసిన పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై మరో 31 పైసలు పెరిగింది. శనివారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84 కాగా, డీజిల్ ధర రూ. 89.97 గా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 107.83 వద్ద ఉండగా, డీజిల్ రూ. 97.45 గా నమోదైంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.49 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 94.39 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.25 కాగా, డీజిల్ ధర రూ. 95.26 గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ పై 31 పైసలు పెరిగి రూ. 105.83 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రూ. 97.96 వద్ద కొనసాగుతోంది. * తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా, డీజిల్ రూ. 97.83 గా నమోదైంది. * ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.23 కాగా, డీజిల్ రూ. 99.80 గా ఉంది. * సాగర నగరం విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 106.80 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 98.43 కు చేరుకుంది.
Also Read: Deadliest Snakes: ఇవి ప్రపంచంలో 5 అత్యంత విషపూరితమైన పాములు.. కాటు వేస్తే అంతే
Bajaj KTM 250: కొత్త బైక్ కొనుగోలు చేసేవారికి బంపర్ ఆఫర్.. ఈ బైక్‌పై రూ.25 వేల వరకు తగ్గింపు..!
Viral News: ఆ దేశ అధ్యక్ష భవనం రక్షణ బాధ్యతను గద్దలు, గుడ్ల గూబలు చూసుకుంటాయి