Deadliest Snakes: ఇవి ప్రపంచంలో 5 అత్యంత విషపూరితమైన పాములు.. కాటు వేస్తే అంతే
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాణాంతకమైన పాములు ఉన్నాయి. WHO లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా జాతుల పాములు కనుగొనబడ్డాయి. వీటిలో 600 జాతులు అత్యంత విషపూరితమైనవిగా చెబుతారు. ఈ రోజు ప్రపంచంలో 5 విషపూరిత పాముల గురించి మీకు తెలియజేస్తాం.
Updated on: Jul 17, 2021 | 12:03 PM

కింగ్ కోబ్రా భూమిపై పొడవైన విషపూరిత పాముగా పరిగణిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. కింగ్ కోబ్రా కాటు వేస్తే అత్యంత భారీ జంతువు ఏనుగు కూడా చనిపోతుంది. ఈ జాతికి చెందిన పాములు తూర్పు, దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తాయి.

సా-స్కేల్డ్ వైపర్, వివిధ జాతుల వైపర్ పాములలో అత్యంత విషపూరితమైనది. ప్రమాదకరమైనది కూడా. సా-స్కేల్డ్ వైపర్ పాములు ఎక్కువగా ఇండియా, చైనా మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి. ఈ పాములు పొడవు విషయంలో మాత్రం చిన్నవిగా ఉంటాయి.

తైపాన్.. ఇది కూడా అత్యంత హానికరమైన పాము. ఈ జాతికి చెందిన పాములు అత్యధికంగా ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఈ పాము విషంలో కనిపించే న్యూరోటాక్సిన్ శరీరంలోని రక్తాన్ని స్తంభింపజేస్తుంది.

Eat Poisonous Snake

బ్లాక్ మాంబా అని పిలవబడే ఈ పాములు సుమారు 14 అడుగుల పొడవు ఉంటాయి. ఈ జాతి పాము గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పాకుతుంది. ఈ పాములు రంగును మార్చే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆఫ్రికాలో కనిపిస్తాయి.





























