RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!

Reserve Bank of India: భారత్‌ సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ ‘మాస్టర్ కార్డ్’కు భారతీయ..

RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Subhash Goud

Updated on: Jul 17, 2021 | 10:20 AM

Reserve Bank of India: భారత్‌ సహా పలు దేశాల్లో వివిధ బ్యాంకుల ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక సేవలు అందించే మల్టీనేషనల్ సంస్థ ‘మాస్టర్ కార్డ్’కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. మాస్టర్‌ కార్డులపై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే స్థానికంగా డేటా నిల్వ చేయాలనే నిబంధనలను పాటించలేదనే కారణంతో ఈనెల 22 నుంచి కొత్తగా కార్డులు (డెబిట్‌, క్రెడిట్‌, ప్రీ-పెయిడ్‌) జారీ చేయరాదని మాస్టర్‌కార్డును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించింది. ఈ పరిణామం దేశీయ ‘రూపే’ కార్డుకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. మాస్టర్‌కార్డ్‌పై నిషేధం వల్ల దేశీయంగా ఐదు బ్యాంకులు, ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ, మరొక కార్డుల జారీ సంస్థ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు విశ్లేసిస్తున్నారు. అయితే ఇప్పటికే జారీ అయిన, వినియోగంలో ఉన్న కార్డుల విషయంలో ఎటువంటి సమస్య రాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసినందున, ప్రస్తుత వినియోగదారులు ఎలాంటి టెన్షన్‌కు గురికావాల్సిన అవసరం లేదు.

కో-బ్రాండెడ్‌ కార్డులు జారీ చేసే సంస్థలకు ఇబ్బందే..

ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకుతో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ కార్డ్‌ కూడా మాస్టర్‌కార్డ్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. అయితే ఈ సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డులకు మాస్టర్‌కార్డు సేవలు పొందలేవు. ఇతర పేమెంట్‌ గేట్‌వే సంస్థలను (వీసా, రూపే) ఇవి ఆశ్రయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కో-బ్రాండెడ్‌ కార్డులు జారీ చేసే సంస్థలు అధికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ పూర్తిగా మాస్టర్‌కార్డు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇతర సంస్థలు జారీ చేసే కార్డుల్లో మాస్టర్‌కార్డు వాటా 10 – 45 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కోటక్‌ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు మాస్టర్‌కార్డు సేవలు తీసుకోవడం లేదు. అటువంటి బ్యాంకులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల జారీ నిమిత్తం వీసా వరల్డ్‌వైడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంకు పేర్కొంది. దీనివల్ల వచ్చే 2 నెలల వ్యవధిలో తమ కస్టమర్లకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు వీసా కార్డులు జారీ చేయగలుగుతుంది. ఇతర పేమెంట్‌ గేట్‌వేలతో ఒప్పందం కుదుర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు యెస్‌ బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే గతంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ను సైతం ఆర్‌బీఐ ఇదే తరహాలో నిషేధించింది.

తాజా పరిణామాలు దేశీయ పేమెంట్‌ గేట్‌వే అయిన ‘రూపే’ కార్డుకు మేలు చేసే విధంగా ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. చెల్లింపుల మార్కెట్‌ను వీసా, మాస్టర్‌కార్డు వినియోగించుకుంటున్న తరుణంలో దేశీయంగా రూపే కార్డును ప్రవేశపెట్టారు. ఈ కార్డు ఎంతో వేగంగా వినియోగదార్లకు చేరువవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా ‘రూపే’ కార్డులే జారీ చేస్తున్నాయి. అందువల్ల లావాదేవీ సంఖ్యలో, చెల్లింపుల మొత్తాల్లో ‘రూపే’ ఇప్పటికే 30 శాతాన్ని మించిపోయింది.

మార్కెట్లో ప్రస్తుతం వీసా అగ్రస్థానంలో..

కాగా, ఈ మార్కెట్లో ప్రస్తుతం వీసా అగ్రస్థానంలో ఉండగా, మాస్టర్‌కార్డు, రూపే తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మాస్టర్‌ కార్డుపై నిషేధం వల్ల, కొత్త కార్డుల జారీకి రూపే వైపు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశం ఉందని, ఆ మేరకు రూపే కార్డుకు ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 90 కోట్ల డెబిట్‌ కార్డులు, 60 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి:

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఆ ఏటీఎమ్‌లకే ఎందుకు వెళ్లాలంటే.. ఎస్‌బీఐలో ఉచితంగా అందిస్తోన్న సేవలు తెలుపుతూ.

Revolt RV400: అమ్మకాల్లో రివోల్డ్‌ ఆర్‌వీ 400 దూకుడు.. బుకింగ్‌ ప్రారంభించిన క్షణాల్లోనే ఔట్ ఆఫ్‌ స్టాక్‌

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి బిజినెస్
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం