Gold: భారత్‌కు బంగారం అత్యధికంగా ఆ దేశం నుంచే వస్తోంది.. పుత్తడి దిగుమతిలో భారత్‌ నాలుగో స్థానం

Gold: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు..

Gold: భారత్‌కు బంగారం అత్యధికంగా ఆ దేశం నుంచే వస్తోంది.. పుత్తడి దిగుమతిలో భారత్‌ నాలుగో స్థానం
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Jul 18, 2021 | 6:35 PM

Gold: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భాతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతీ ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని వారుండరు. అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు. బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు, పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ సాధనంగా భావించి, దీనిపై పెట్టుబడి పెట్టేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే భారత్‌ దిగుమతి చేసుకుంటున్న బంగారంలో దాదాపు సగం వరకు ఒకే దేశం నుంచి వస్తోంది. 2020-21 లెక్కల ప్రకారం భారత్‌ మొత్తం 34.6 బిలియన్‌ డాలర్లు విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుందని గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో 16.3 బిలియన్‌ డాలర్ల పుత్తడి స్విట్జర్లాండ్‌ నుంచే వచ్చింది. కరోనా మహమ్మారి రాక ముందు ఏడాది కంటే 2020-21లో భారత్‌ 6.4 బిలియన్‌ డాలర్లు అధికంగా దిగుమతి చేసుకుంది. ఇక స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతులు కూడా 7.8 శాతం 18.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

పుత్తడి దిగుమతిలో భారత్‌ నాగులో స్థానం:

కాగా, బంగారం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది. గతంలో ఆ స్థానంలో సౌదీ ఆరేబియా ఉండేది. ఇక చైనా నుంచి దిగుమతుల్లో 0.07శాతం తగ్గుదల నమోదై 65.21 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తం అన్ని వస్తువు సేవల దిగుమతుల్లో ఇప్పటికీ అత్యధిక వాటా చైనాదే. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, యూఏఈ ఉన్నాయి. బంగారం వినియోగదారుల్లో ప్రపంచలోనే చైనా తర్వాత స్థానంలో భారత్‌ ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం శుద్ది కేంద్రం స్విట్జర్లాండ్‌:

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం శుద్ది కేంద్రం స్విట్జర్లాండ్‌ ఉంది. ఇక్కడ అత్యున్నత శ్రేణి పసిడి లభిస్తుంది. దీంతో స్వర్ణ ప్రియులు స్విట్జర్లాండ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదండోయ్‌.. అతి పెద్ద రవాణా హబ్‌ కూడా స్విట్జర్లాండే. బంగారంపై పన్నును కూడా 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అందుకే కొన్ని రోజులుగా అక్కడి నుంచి దిగుమతులు పెరుగుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. గతేడాది యూఏఈ నుంచి 4.19 బిలియన్‌ డాలర్లు, దక్షిణాఫ్రికా నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల విలువైన పుత్తడిని కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

RBI: మాస్టర్‌ కార్డు నిషేధంతో రూపే కార్డుకు మేలు జరుతుందా..? ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఆ ఐదు బ్యాంకులపై..!

Bajaj KTM 250: కొత్త బైక్‌ కొనుగోలు చేసేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఈ బైక్‌పై రూ.25 వేల వరకు తగ్గింపు..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.