- Telugu News Photo Gallery Cinema photos Salman khan sikandar movie ticket offer for gathering audience
Salman Khan: సల్మాన్‌కు ఇంతకంటే అవమానం ఉంటుందా..?
స్టార్ హీరోల సినిమాలొస్తే.. ఒక్క టికెట్ ఇప్పించండ్రా బాబూ.. డబ్బులు ఎంతైనా పర్వాలేదు అంటుంటారు అభిమానులు. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓ స్టార్ హీరో సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్స్ లేవు. అందుకే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటున్నారు.. ఆ మధ్య ఓ హీరో ఫ్రీగా సమోసాలిస్తాం.. తోడుగా ఛాయ్ ఇస్తాం అన్నారు. అసలేంటి పరిస్థితి.. ఎవరా హీరో..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Mar 29, 2025 | 1:46 PM

ఒకప్పుడు బాలీవుడ్‌లో తిరుగులేని విజయాలు అందుకున్న సల్మాన్ ఖాన్‌కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఒకప్పట్లా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ లేవు.. వసూళ్లు లేవు. కొన్నిసార్లు సినిమాలు వచ్చినట్లు కూడా ఐడియా లేదు.

తాజాగా సల్మాన్ నటించిన సికిందర్ మార్చి 30న విడుదలవుతుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు టికెట్ బుకింగ్ యాప్స్.

సల్మాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా టికెట్స్ కోసం ఆడియన్స్ ఎగబడాలి.. కానీ అలా జరగట్లేదిప్పుడు. అసలు మ్యాటర్ ఏంటంటే సికందర్ ఫస్ట్ డే చూడ్డానికి కూడా కొన్ని టికెట్ యాప్స్‌లో 150 రూపాయలు కూపన్ ఇచ్చారు.

రెండు టికెట్లు కొంటే ఈ కూపన్ వాడొచ్చు. అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నమాట. సల్మాన్ రేంజ్‌కు కూడా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే గానీ జనం రావట్లేదు. ఆ మధ్య అక్షయ్ కుమార్ సర్‌ఫిరా సినిమాకు వస్తే.. ఒక టికెట్‌పై రెండు సమోసాలతో పాటు ఒక టీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి పివిఆర్ ఐనాక్స్ సంస్థలు.

మల్టీప్లెక్స్‌లలో ఓ టీ, 2 సమోసా అంటే వందల్లో మ్యాటర్. కానీ ఇచ్చారు ఆ సినిమా కోసం. ఎంతైనా సల్మాన్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఈ దుస్థితి రావడం నిజంగా దారుణమైన విషయమే.





























