Keerthy Suresh: వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి కీర్తి సురేష్ రీ ఎంట్రీ
మోస్ట్ కన్వీనియెంట్ హీరోయిన్.. కీర్తి సురేష్‌ని చూస్తుంటే ఇప్పుడు ఈ ట్యాగ్ లైన్ ఇవ్వాలేమో..? నిన్నటి వరకు సౌత్ వద్దు.. బాలీవుడ్ ముద్దు అన్న ఈ బ్యూటీ.. తాజాగా టాలీవుడ్‌లో డ్యూటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకటి కాదు కుదిర్తే రెండు సినిమాలతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. మరి అవేంటి..? ఆ సినిమాలకు దర్శకులెవరు..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 29, 2025 | 1:41 PM

భోళా శంకర్ వచ్చి రెండేళ్లు కావొస్తుంది.. ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు కీర్తి సురేష్. దానికి ముందు దసరాలో నానితో నటించారీమే. ఈ సినిమాలో వెన్నెల పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి.

కానీ తమిళం, హిందీపైనే ఎక్కువగా ఫోకస్ చేసారు కీర్తి. తాజాగా మళ్లీ ఈమె చూపులు టాలీవుడ్‌పై పడుతున్నాయి. కీర్తి సురేష్ ఓకే అనాలే గానీ తెలుగులో ఈమెకు అవకాశాల కొరత ఎప్పుడూ రాలేదు. కాకపోతే చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటారు కీర్తి.

పైగా పెళ్లి హడావిడి, బాలీవుడ్ డెబ్యూ ఇవన్నీ ఉండేసరికి తెలియకుండానే తెలుగులో భారీ బ్రేక్ వచ్చేసింది. దీన్ని ఒకేసారి తీర్చేయాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. అందుకే రెండు తెలుగు సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

కీర్తి సురేష్ నటిస్తున్న రివాల్వర్ రీటా, కన్నివేది త్వరలోనే విడుదల కానున్నాయి. వీటితో పాటు మలయాళంలో టొవినో థామస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే హిందీలో రణ్‌బీర్ కపూర్ సినిమాలోనూ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఇవన్నీ ఉండగానే.. తాజాగా తెలుగులో నితిన్, విజయ్ దేవరకొండ సినిమాల్లో కీర్తికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

నితిన్ హీరోగా వేణు తెరకెక్కించబోయే ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా రౌడీ జనార్ధనలోనూ ఈ భామే హీరోయిన్. ఈ రెండూ దిల్ రాజే నిర్మించబోతున్నారు. గతంలో ఇదే బ్యానర్‌లో నేను లోకల్ చేసారు కీర్తి. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లతో రాబోతున్నారు ఈ బ్యూటీ.





























