Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. పెళ్లికాని ప్రసాద్ కు దొరికిన జోడీ..

బాల్యం స్మృతులను గుర్తు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సామాన్యులు, సెలబ్రేటీలు, అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ తమ చిన్నతనం గురించి వీలు దొరికినప్పుడు అందరికీ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సిని యాక్టర్స్ అయితే తమ చిన్నతనం గురుంచి చెబుతూ అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అబిమానులకు కనువిందు చేస్తారు. అలాంటి ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్, తెలుగులో కూడా నటించింది ఎవరో గుర్తు పట్టండి అని సవాల్ చేస్తున్నారు.

Childhood Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.. పెళ్లికాని ప్రసాద్ కు దొరికిన జోడీ..
Childhoodmemories
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2025 | 1:49 PM

మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి రాణించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే విదేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టి ఇక్కడ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు సాధించిన నటీనటులు ఎందఱో ఉన్నారు. కానీ వీరిలో ముందుగా గుర్తుకొచ్చే పేరు కత్రినా కైఫ్. తండ్రి కశ్మీరీ..తల్లిది బ్రిటన్. అంటే మొహ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నే కైఫ్. కత్రినాకు ఏడుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళు. బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో కత్రినా పుట్టింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో దేశాలకు తిరిగిన కత్రినా.. మొదట మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది.

మోడల్‌గా కింగ్ ఫిషర్ క్యాలెండర్‌లో కనిపించిన కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో బూమ్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో వెంకటేష్ సరసర మల్లీశ్వరి సినిమాలో నటించింది. తర్వాత మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలతో హిట్ అందుకుంది. కానీ నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి. న్యూయార్క్ సినిమాలో కత్రినా నటనకు మొదటిసారిగా ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

విమర్శలకు ప్రశంసలకు అతీతంగా వరసగా సినిమాలను చేస్తూ కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కమర్షియల్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూనే ఐటెం సాంగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తన తల్లితో కలసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అందుకోసం స్టేజ్ షోలు కూడా చేస్తారు.

సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తో ప్రేమాయణం అంటూ పుకార్లు షికారు చేసేవి. అయితే కత్రినా డిసెంబర్ 9, 2021న విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. హిందూ సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుంది. విక్కీ కౌశల్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్నాడు. చావా సినిమాతో యావత్ భారతాన్ని తనవైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో