Tabu : ఏంటీ.. ఈ అమ్మాయి టబు కూతురా.. ? 54 ఏళ్ల వయసులో ఇలా ట్విస్టు ఇచ్చారేంటీ మేడమ్..
ఒకప్పుడు తెలుగులో వరుస విజయాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ టబు. వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ విభిన్న కంటెంట్ చిత్రాలతో మెప్పిస్తుంది. తాజాగా తన కూతురు అంటూ ఓ అమ్మాయిని పరిచయం చేసింది.

హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 54 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్, లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన టబు.. ఇప్పుడు కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో కుర్రహీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తుంది. పెళ్లికి దూరంగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అందం, అభినయంతో యువతకు చెమటలు పట్టిస్తోంది. దక్షిణాదితోపాటు అటు హిందీలోనూ సత్తా చాటుతుంది. టబుకు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
నాగార్జున జోడిగా టబు నటించిన నిన్నే పెళ్లాడతా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న టబు.. ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో అలరిస్తుంది. ప్రస్తుతం టబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదెలా ఉంటే.. ఇటీవల ఇక్కీస్ ప్రీమియర్ షోకు హాజరైన టబు.. అక్కడ కనిపించిన హీరోయిన్ ఫాతీమాను చూసి ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ఫాతిమా తన కూతురు అంటూ టబు పరిచయం చేయడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. 1997లో చాచి 420 అనే సినిమాలో టబు కూతురిగా ఫాతిమా సనా చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఇక ఇప్పుడు సైతం తన కూతురు అంటూ పరిచయం చేసింది టబు. ఈ చిత్రాన్ని తెలుగులో భామనే సత్యభామనే పేరుతో రీమేక్ చేశారు. ఫాతిమా సనా.. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..




