AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఘోరమైన పాపం చేశావ్’..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ హీరోయిన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అందాల తారపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘోరమైన తప్పు చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హీరోయిన్ ఏం చేసిందంటే?

Tollywood: 'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
Bollywood Actress Nushrat Bharucha
Basha Shek
|

Updated on: Dec 31, 2025 | 7:31 PM

Share

నుష్రత్ బరూచా.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తరచూ వినిపిస్తోంది. గతంలో శివాజీతో కలిసి తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్యన బెల్లం కొండ శ్రీనివాస్ తో కలిసి ఛత్రపతి రీమేక్ లోనూ కథానాయికగా నటించిన నుష్రత్ పై ఇప్పుడు ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. నుష్రత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయాన్ని సందర్శించింది. అక్కడి శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ముస్లిం లు నుష్రత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ నుష్రత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘నుష్రత్ భారుచా ఉజ్జయినిలోని మహాకల్ ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె శివలింగానికి పూజలు చేసింది. గంధం పూసుకుంది. ఆమె అక్కడి మత సంప్రదాయాలను అనుసరించింది. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. షరియా ప్రకారం, నుష్రత్ ఘోరమైన పాపం చేసింది. ఆమె వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. నటి పశ్చాత్తాపం చెంది కల్మా పఠించాలి’ అని మౌలానా డిమాండ్ చేశారు.

అయితే ఈ వివాదంపై నుస్రత్ ఇంకా స్పందించలేదు. అయితే నుష్రత్ ఇలా మహాకాల్ ఆలయాన్ని సందర్శించడం ఇదేమీ మొదటి సారి కాదని తెలుస్తోంది. గతంలోనూ చాలా సార్లు ఇలా వివిధ హిందూ దేవాలయాలను, గుడులను సందర్శించిందని తెలుస్తోంది. అలాగే ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆలయం, మసీదు లేదా చర్చి అయినా వివిధ ప్రార్థనా స్థలాలలో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

  మహాకాల్ ఆలయంలో నుష్రత్ బరూచా..

‘మీకు ఎక్కడ శాంతి లభిస్తే, అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా మీరు అక్కడికి వెళ్లాలి. నాకు సమయం దొరికితే, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాను. ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..