AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? రైల్వేశాఖ కీలక మార్పులు. ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఇబ్బందే

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌కు సంబంధించి ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. ఫ్లాట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులు దీనిని గమనించాలని అధికారులు పేర్కొన్నారు.

Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? రైల్వేశాఖ కీలక మార్పులు. ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఇబ్బందే
Secunderabad Railway Statio
Venkatrao Lella
|

Updated on: Dec 31, 2025 | 6:34 PM

Share

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గత కొద్ది నెలలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్‌ను కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారు. కొద్ది నెలలుగా ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సమగ్ర చొరవలో భాగంగా పునరాభివృద్ధి పనులను రైల్వేశాఖ యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. స్టేషన్ ప్రాంగణంలో భద్రత పాటిస్తూనే.. రైలు ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా దశలవారీగా ఈ పనులు చేపడుతున్నారు.

ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొనసాగుతున్న పునరాభివృద్ధి కార్యకలాపాలు సజావుగా జరుగడానికి ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు ఫ్లాట్ ఫారం 1 వద్ద పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉండదు. తక్కువ సమయంలో మాత్రమే పికప్ మరియు డ్రాప్ వాహన రాకపోకలను అనుమతిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రైళ్లు ఎక్కడానికి లేదా దిగడానికి వచ్చేవారి కోసంచ పికప్, డ్రాప్ పార్కింగ్ ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు తగినంత పార్కింగ్ సౌకర్యం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని ముఖ్యమైన ప్రదేశాలలో స్పష్టమైన దిశానిర్దేశక సంకేతాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా సందేశాలు, ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ చర్యలు ప్రయాణీకుల భద్రత, భవిష్యత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పున:నిర్మాణ పనులు మరో కొద్ది నెలల పాట జరిగే అవకాశముంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తొలగించేందుకు వేగంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.