Tollywood: ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. ఒక్క వీడియోతో కెరీర్ నాశనం.. ఈ హీరోయిన్ ఎవరంటే..
రాజకుటుంబానికి ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. వరుస సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటున్న సమయంలోనే లీక్ అయిన ఒక్క వీడియో ఆమె కెరీర్ ను నాశనం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

బాలీవుడ్ సినీప్రపంచంలో ఇప్పుడు స్టార్ పిల్లలు రాణిస్తున్నారు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తున్నారు. కానీ కొంతమంది సినీతారలు నేపథ్యం, ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉండడం వలన వారికి ప్రత్యేక శ్రద్ధ ఇస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ అలాంటి కథే. ఆమె జీవితం పూర్తిగా సినిమాతో కూడుకున్నది. రియా సేన్.. ఆమె తండ్రి భరత్ దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందినవారు. తల్లి మూన్ మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ మాత్రం ఇండస్ట్రీలో పాపులర్ నటీమణులు. రియా అక్క రైమా సేన్ సైతం ప్రముఖ నటి. ఫ్యామిలీ మొత్తం నటీమణులే ఉండడంతో రియా తన నటనా ప్రయాణాన్ని ఐదేళ్ల వయసులోనే ప్రారంభించింది. తన తల్లితో కలిసి ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత 1991లో ‘విష్కన్య’ చిత్రంలో బాలనటిగా కనిపించింది.
ఫేమస్ సింగర్ ఫల్గుణి పాఠక్ రూపొందించిన ‘యాద్ పియా కి ఆనే లగీ’లో కనిపించిన తర్వాత రియా మరింత పాపులర్ అయ్యింది. స్టైల్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే రియా స్టార్ స్టేటస్ అందుకుంటున్న సమయంలోనే 2005లో ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయ్యింది. ఈ క్లిప్ చాలా త్వరగా వైరల్ అయింది. ఆ వీడియో ఫేక్ అని రియా, అష్మిత్ ఖండించారు. ఈ ఘటన తర్వాత రియాకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. అలాగే ఆమె నటించిన సినిమాలు సైతం డిజాస్టర్స్ అయ్యాయి.
ఆ ఘటన తర్వాత రియా బెంగాళీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. వరుస డిజాస్టర్స్ తర్వాత రియా సంతోష్ శివన్ మలయాళ చిత్రం ‘అనంతభద్రం’ (2005)లో పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లు తన స్నేహితుడు శివం తివారీతో ప్రేమలో ఉన్న ఆమె.. 2017లో అతడిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ వెబ్ సిరీస్ సేస్తుంది రియా.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..