Ram Pothineni: మరోసారి ప్రేక్షకులను డ్యూయెల్ రోల్‌లో అలరించడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ హీరో

Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన రామ్ పోతినేని 'రెడ్' మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. 'రెడ్' మూవీలో..

Ram Pothineni: మరోసారి ప్రేక్షకులను డ్యూయెల్ రోల్‌లో అలరించడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ హీరో
Ram
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 2:35 PM

Ram Pothineni: ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన రామ్ పోతినేని ‘రెడ్’ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ‘రెడ్’ మూవీలో రామ్ డ్యూయెల్ రోల్ చేశాడు. రెండు పాత్రల్లో రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే తాజాగా తమిళ దర్శకుడు లింగుసామి సినిమాలో కూడా మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

మాస్ సినిమాలను స్టైలిష్ గా తెరకెక్కించే లింగుస్వామి ఈసారి కూడా హీరో రామ్‌కు తగ్గట్టుగా అదే తరహా సినిమాను రెడీ చేశారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేశారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘ఉస్తాద్’ అనే ఊరమాస్‌ టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

ఇకపోతే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపించనున్నారట. ఈ పాత్రలో మాస్ యాంగిల్ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఎంతటి ప్రమాదాన్నైనా చాలా ఈజీగా తీసుకుంటూ ఎదురెళ్లే పాత్రలో రామ్ యాక్షన్ ఒక రేంజ్ లో ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. సమస్య ఎంతపెద్దదైనా ఆయన చాలా సింపుల్ గా తీసుకుంటూ దూకుడుగా వెళ్లే తీరు మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉంటుందని పలువురు అంటున్నారు.

అలాగే ఈ సినిమాలో రామ్ ‘డాక్టర్’గా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. డాక్టర్ గా ఆయన తెరపై కనిపించడం ఖాయమేననీ, అయితే నాటకీయంగా ఆయన ఆ పాత్రలో కాసేపు కనిస్తారా? లేదంటే నిజంగానే డ్యూయెల్‌ రోల్‌ చేయబోతున్నారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం ఆది పినిశెట్టిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ‘సరైనోడు’ తరహాలోనే ఆయన విలనిజం చాలా పవర్ఫుల్ గా ఉండనుందని సమాచారం. రామ్‌కు జోడీగా ఉప్పెన ఫేమ్‌ కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:

: వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!