Nandamuri Balakrishna: అభిమానులకు ఒక గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్ న్యూస్ చెప్పిన బాలయ్య…

నందమూరి వారసుడి ఎంట్రీ విషయంలో మరోసారి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు....

Nandamuri Balakrishna: అభిమానులకు ఒక గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్ న్యూస్ చెప్పిన బాలయ్య...
Balakrishna
Follow us
Ram Naramaneni

| Edited By: Subhash Goud

Updated on: Jul 19, 2021 | 9:08 AM

నందమూరి వారసుడి ఎంట్రీ విషయంలో మరోసారి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు బాలకృష్ణ. మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే ఆ రోజు కోసం ఇంకో రెండేళ్ల పాటు వెయిట్ చేయక తప్పదంటున్నారు బాలయ్య. యస్‌… మోక్షజ్ఞ డెబ్యూ మూవీ 2023లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని చెప్పిన బాలయ్య ఇప్పుడు టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్స్ షేర్ చేసుకున్నారు. ఆల్రెడీ మెయిన్‌ ప్లాట్‌ ఓకే అయిన ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామన్నారు. ఇంకా డైరెక్టర్‌ను ఫైనల్ చేయలేదన్న బాలయ్య… తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్న విషయాన్ని కూడా మరోసారి గట్టిగానే చెప్పారు.

సీక్వెల్‌లో.. బాలయ్య కూడా నటించినా.. మెయిన్ హీరోగా మాత్రం మోక్షజ్ఞే కనిపించబోతున్నారట. డెబ్యూ సినిమాలో ఈ నందమూరి వారసుడు సూపర్‌ హీరో కైండ్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో నెవ్వర్‌ బిఫోర్ అన్న రేంజ్‌లో ఆదిత్య 999 మ్యాక్స్‌ను ప్లాన్ చేస్తున్నామన్నారు బాలకృష్ణ. కాగా మరో రెండేళ్ల పాటు మోక్షు ఎంట్రీ కోసం.. వెయిట్ చెయ్యాలా అంటూ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శకత్వం వైపు కూడా బాలయ్య అడుగులు వేస్తూ ఉండటంతో.. ఆ విషయంలో ఖుషీగా ఉన్నారు.

Also Read: కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్.. సిబ్బందికి కీలక సూచనలు

 ఆ అపవాదును పూర్తిగా తుడిచిపెట్టేసిన దర్శకధీరుడు.. ఈ డైరెక్టర్స్ మాత్రం లైన్ తప్పారు