SS Rajamouli: ఆ అపవాదును పూర్తిగా తుడిచిపెట్టేసిన దర్శకధీరుడు.. ఈ డైరెక్టర్స్ మాత్రం లైన్ తప్పారు
చెప్పిన టయానికి సినిమా అందివ్వలేడనే అపవాదును ఈసారి పూర్తిగా తుడిచిపెట్టేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఆరునూరైనా...
చెప్పిన టయానికి సినిమా అందివ్వలేడనే అపవాదును ఈసారి పూర్తిగా తుడిచిపెట్టేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఆరునూరైనా దసరాకొచ్చేస్తున్నా అంటూ స్ట్రాంగ్ వీడియోతో కొట్టిమరీ చెప్పేశారు. కానీ.. టాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనే పేరున్న మిగతా కెప్టెన్లు మాత్రం.. వెనకెనకే వుండిపోయారు. సమ్మర్ సీజన్లో ఎర్లీ డేట్‌ని లాక్ చేసుకుని.. ధీమాగా వున్న ఆచార్యను, అఖండను కోవిడ్ సెకండ్ వేవ్ వెనక్కు నెట్టేసింది. అన్‌లాక్ తర్వాత షూట్ రీస్టార్ట్ చేసి.. బౌన్స్‌బ్యాక్ అయినా.. ఆచార్యలో ఆ కాన్ఫిడెన్స్ మాత్రం కనిపించడం లేదు. చిరంజీవి షూట్ పార్ట్ కంప్లీట్ అయ్యాక.. ఇప్పుడు చరణ్ మీద సీన్స్ తీస్తున్నారు కొరటాల. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిషైనప్పటికీ.. సంక్రాంతి దాకా వెయిట్ చేద్దామనే ధోరణితో వుందట ఆచార్య టీమ్.
అఖండ కూడా నో హర్రీస్ నో వర్రీస్ అంటున్నారట. రీసెంట్‌గా బోయపాటి చెప్పిన మాటలు సినిమా ప్రోగ్రెస్‌పై డౌట్స్ రెయిజ్ చేశాయి. అటు.. ఆగస్టులో రావల్సిన పుష్ప… రీసెంట్‌గా స్ట్రాటజీ మార్చుకుని… రెండు పార్టులుగా రావాలని ఫిక్సయింది. ఫస్ట్ పార్ట్‌కి సంబంధించి షూట్ కంప్లీట్ అయినా.. రిలీజ్ విషయంలో తొందరపాటు వద్దన్నది సుక్కూ క్యాంప్ ఆలోచన. అక్టోబర్ మంత్‌ని ట్రిపులార్ క్యాప్చర్ చేయడంతో.. క్రిస్మస్ లేదా పొంగల్ సీజన్ మీదే హోప్స్ పెట్టుకున్నాడు పుష్పరాజ్.
డార్లింగ్ మూవీ రాధేశ్యామ్ కూడా ఇంకా డైలమాలోనే వున్నాడు. ఈనెల 23 నుంచి చివరి షెడ్యూల్ మొదలుపెట్టే ప్లాన్‌లో వుంది రాధాక్రిష్ణ క్యాంప్. ఫైనల్ అవుట్‌పుట్ చేతికి రావడానికి ఇంకా టైమ్ పడుతుంది కనుక…. రిలీజ్ విషయంలో హైరానా వద్దనుకుంటోంది టీమ్ ఆఫ్ రాధేశ్యామ్. సో.. డైహార్డ్ ఫ్యాన్స్‌కి ఇంకా వెయిటింగ్ తప్పదన్నమాట. ఈ లెక్కన జక్కన్నకున్న కాన్ఫిడెన్స్ లెవల్స్‌లో సగం కూడా మిగతా మేకర్స్‌లో లేనట్టేనా? అని చర్చింకుంటున్నారు సినీ జనం.
Also Read: కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్.. సిబ్బందికి కీలక సూచనలు