AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strawberry-Beauty Tips: మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా స్టాబెరీతో ఇలా చేసి చూడండి.. మెరిసే దంతాలు మీ సొంతం

Strawberry For Skin: తీపి పులుపు కలయికతో ఉండే స్టాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే...

Strawberry-Beauty Tips: మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా స్టాబెరీతో ఇలా చేసి చూడండి.. మెరిసే దంతాలు మీ సొంతం
Strawberry Beauty Tips
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 18, 2021 | 9:01 PM

Share

Strawberry For Skin: తీపి పులుపు కలయికతో ఉండే స్టాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలిసిందే.. అయితే ఈ స్ట్రాబెర్రీలు రుచికరమైన పండే కాదు.. అందాన్ని ఇచ్చే పండు కూడా.. స్టాబ్రెర్రీ సహజమైన చర్మ సంరక్షణ ఇస్తుంది.

*చర్మానికి నష్ఠంన్నిచ్చే సూర్య కిరణాల నుంచి స్టాబెర్రీ రక్షిస్తుంది. ఎల్లాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్ సహా అనేక యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్నీ సూర్యకిరణాల నుంచి రక్షణ ఇస్తాయి. * అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించబడుతున్న ది. సాలిసిలిక్ ఆమ్లం స్ట్రాబెర్రీలో ఉంది. ఇది బీటా హైడ్రాక్సీ ఆమ్లం, హైపర్ పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. * స్ట్రాబెర్రీలో ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మం శుభ్రపడడానికి.. రంగు పెరగడానికి సహాయపడతాయి. అందుకని చర్మం పొడిబారినప్పుడు స్ట్రాబెర్రీలను పేస్ట్ చేసి చర్మానికి ప్యాక్ లా వేసుకుంటే ఫలితం ఉంటుంది. *దంతాలు శక్తివంతంగా తెల్లగా మెరిసేలా చేస్తాయి. స్ట్రాబెర్రీల్లో ఉన్న మాలిక్ ఆమ్లం దంతాలను తెల్లగా మార్చడానికి పని చేస్తుంది. కనుక స్టాబెర్రీలను తినడమే కాదు.. వీటిని ముక్కలుగా గార పట్టిన దంతాలపై వ్యతిరేకంగా ముందుకు వెనుకకు రుద్ది.. తర్వాత నోటిని శుభ్రం చేసుకోండి. ఆశ్చర్యకరమైన ఫలితం సొంతమవుతుంది. * స్ట్రాబెర్రీల్లో రక్తప్రసరణ మెరుగుపరిచే గుణం ఉంది. కనుక కళ్లకింద నల్లటి వలయాలను కంటి కింద ఉబ్బిన చర్మాన్ని తగ్గించడానికి సహాయపడతాయి, ఒక పెద్ద స్ట్రాబెర్రీని రెండు ముక్కలుగా చేసి, పడుకునేటప్పుడు ముక్కలను కనురెప్పల మీద పెట్టుకోవాలి. అలా ఓ 15 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తర్వాత ముఖాన్ని చల్లటి నీతితో శుభ్రం చేసుకుంటే మంచిఫలితం సొంతమవుతుంది. *గోర్లు బలంగా పెరగడానికి ఉత్తమ పోషకం స్ట్రాబెర్రీలు. *పగిలిపోయిన, నిర్జీవంగా చర్మం కల పాదాలను మృదువుగా చేయడానికి స్ట్రాబెర్రీ, గ్లిసరిన్, ఓట్స్ కలిపిన మిశ్రమం వలన మంచి ఫలితం ఉంటుంది. ముందుగా పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి.. తరువాత తయారు చేసుకున్న స్టాబెర్రీ మిశ్రమాన్ని అప్లై చేసి..సున్నితంగా మర్దనా చేసుకోవాలి. సహజమైన స్క్రబ్‌గా పనిచేసి పాదాల పగుళ్ళను నివారిస్తుంది.

Also Read: Upasana-Namrata: ఒకే ఫేమ్ లో మెగా కోడలు ఉపాసన, కూతురు శ్రీజ, మహేష్ బాబు భార్య నమ్రతలు.. సోషల్ మీడియాలో హల్ చల్