AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Tips: మీ జుట్టు బాగా ఊడిపోతుందా?.. అయితే ఈ టిప్స్ పాటించండి.. జట్టును వత్తుగా చేసుకోండి..!

Hair Fall Tips: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టే వ్యక్తుల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. స్త్రీలు అయినా..

Hair Fall Tips: మీ జుట్టు బాగా ఊడిపోతుందా?.. అయితే ఈ టిప్స్ పాటించండి.. జట్టును వత్తుగా చేసుకోండి..!
Hair Tips
Shiva Prajapati
|

Updated on: Oct 10, 2021 | 7:55 PM

Share

Hair Fall Tips: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టే వ్యక్తుల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. స్త్రీలు అయినా.. పురుషులు అయినా.. అందమైన జుట్టు ఉంటే ఆ ప్రత్యేకతే వేరు. అయితే, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టు సంరక్షణపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు ప్రజలు. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, జన్యుపరమైన కారణాలు, పోషకాహార లోపం తదితర కారణాల వల్ల చాలా మంది జట్టు రాలిపోవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దాంతో అందరూ ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే.. జుట్టు రాలడాన్ని నిలువరించేందుకు మన ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఉల్లిపాయ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లిపాయతో జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టు రాలకుండా ఉల్లిపాయతో ఏం చేయాలి? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం..

ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు అప్లై చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది. జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టు మొదళ్లలో ఉండే కొల్లాజెన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. మీ జుట్టు పొడవును బట్టి 3, 4 ఉల్లిపాయలను కోసి వాటిని మెత్తగా రుబ్బి.. రసాన్ని తీయాలి. ఆ రసాన్ని తలకు అప్లై చేసి సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఉల్లిపాయ, గుడ్డు హెయిర్ మాస్క్.. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి.. గుడ్డు సొన, ఉల్లిపాయ రసాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. గుడ్లు, ఉల్లిపాయలు రెండూ జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

ఉల్లిపాయ, కొబ్బరి నూనె.. జుట్టు పెరుగుదలను పెంచడానికి కొబ్బరి నూనెను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇక ఉల్లిపాయ రసం కూడా జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. కొబ్బరి నూనెను కండీషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు.. జుట్టు దీనిని త్వరగా శోషించుకుంటుంది. అయితే, రెండు చెంచాల ఉల్లిపాయ రసాన్ని, రెండు చెంచాల కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం దీనిని ప్రచురితం చేయడం జరుగుతుంది. దీనికంటూ శాస్త్రీయ ఆధారాలు లేవు అనే విషయాన్ని గమనించాలి.

Also read:

How To Become Rich: మీరు ధనవంతుడు కావాలనుకుంటే ఈ 11 సులువైన సూత్రాలు పాటించండి.. అవి ఏమిటంటే..

Viral News: పిచ్చి పీక్స్‌కి వెళ్లడం ఇంటే ఇదే మరి!.. ఈ అమ్మాయికి ఆ లుక్‌లో కనిపించడం అంటే చాలా ఇష్టమట!

Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వేటకు వెళ్లిన అందరి వలల్లో లక్షలాది రూపాయల విలువచేసే అరుదైన కోనాం చేపలు