Navratri 5th Day Naivedyam: రేపు నవరాత్రి ఐదోరోజు.. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం.. ఎలా తయారు చేయాలంటే
Navratri 5th Day Naivedyam: నవరాత్రుల్లో రేపు ఐదో రోజు.. పంచమి నాడు శక్తి స్వరూపిణి అమ్మవారు స్కందమాత, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులతో పూజలను..
Navratri 5th Day Naivedyam: నవరాత్రుల్లో రేపు ఐదో రోజు.. పంచమి నాడు శక్తి స్వరూపిణి అమ్మవారు స్కందమాత, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులతో పూజలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో రేపు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పిస్తారు. ఈరోజు దద్దోజనం తయారీ గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం- అర కిలో పాలు -అర లీటరు చిక్కటి పెరుగు- అరలీటరు జీడిపప్పు పోపు సామాగ్రి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ నూనె నెయ్యి కొత్తిమీర కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలుగా ఉప్పు రుచికి సరిపడా
తయారు చేసే విధానం: ముందు బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి వార్చుకోవాలి. తర్వాత ఆ అనాన్ని చల్లార్చుకుని.. అందులో కాచి చల్లారిన పాలు, పెరుగు, ఉప్పు వేసి.. బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. అవిపక్కకు తీసుకుని దానిలో కొంచెం నూనె వేసి.. సన్నగా తగిరిన పచ్చి మిర్చి, అల్లం, వేయించుకోవాలి. తర్వాత శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిచ్చి.. తర్వాత ఇంగువ, కొత్తిమీర వేసుకుని మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఈ పోపుని ముందుగా రెడీగా ఉంచుకున్నం పెరుగు అన్నంలో కలుపుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పుని వేసుకుంటే.. ఘుమ ఘుమలాడే దద్దోజనం రెడీ.. అమ్మవారి ప్రియమైన దద్దోజనం నైవేద్యంగా పెట్టి.. ఆ చల్లని తల్లి దీవెనలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్ధించండి.
Also Read: