Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎలప్పుడూ అబద్దాలు చెబుతారు.. అస్సలు నమ్మకూడదు.!
ప్రపంచంలో అబద్దాలకోరులు, మోసపూరిత వ్యక్తులకు కొరత లేదు. ఇలాంటివారు తమ స్వలాభం కోసం ఎవరికైనా ఇట్టే అబద్దాలు…
ప్రపంచంలో అబద్దాలకోరులు, మోసపూరిత వ్యక్తులకు కొరత లేదు. ఇలాంటివారు తమ స్వలాభం కోసం ఎవరికైనా ఇట్టే అబద్దాలు చెబుతుంటారు. ఇదిలా ఉంటే జోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారు పుట్టిన దగ్గర నుంచి అబద్దాలు చెప్పడంలో దిట్ట. ఈ వ్యక్తులు తమను తాము ఇబ్బందుల నుండి బయటపడటానికి అవలీలగా అబద్దాలు చెప్పేస్తారు. ప్రతీ వ్యక్తికి ఏదొక అలవాటు ఉంటుంది. అలాగే కొందరికి అబద్దం చెప్పడం అలవాటు. అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆ రాశులవారు ఎవరో చూసేద్దాం..
కర్కాటకం:
ఈ రాశివారు వీలైనంత వరకు ఏ విషయంలోనైనా అబద్దాలు చెబుతారు. ఉత్సాహభరిత స్వభావం కలిగిన ఈ వ్యక్తులు.. తమ మాటల ద్వారా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు.
సింహరాశి:
సింహరాశి వ్యక్తులు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి అబద్దాలు చెబుతుంటారు. స్వతహాగా అహంకారంతో ఉండే ఈ వ్యక్తులు అబద్దాలను వ్యతిరేకిస్తామని బయటికి చెబుతుంటారే గానీ.. వారే పాపులారిటీ కోసం అబద్దాలు చెబుతారు.
మిథునం:
మిధునరాశి వారు క్షణికావేశంలో సత్యాన్ని మార్చేస్తారు. తాను ఓ మంచి స్నేహితుడినని అనిపించుకోవడానికి ఎలాంటి వివాదాన్ని అయినా చిటికెలో సాల్వ్ చేసేస్తారు. చాలా తెలివైనవారు కూడా. తమ మాటలతో అందరినీ ఇట్టే నమ్మిస్తారు.
వృశ్చికరాశి:
వృశ్చిక రాశివారు అబద్ధాలు చెప్పడంలో నేర్పరులు. ఎలా అంటే.. వారి అబద్దం చెప్పారంటే.. దాన్ని నిరూపించడం కూడా కష్టమే. ఏ విషయానికైనా, ఏ సందర్భంలోనైనా వాళ్లు అబద్దాలు చెబుతుంటారు. అయితే వారి మాటలు విని, అర్ధం చేసుకోగలిగితే.. వారు చెప్పే అబద్దాలను పసిగట్టేయొచ్చు.
తులారాశి:
తులారాశివారు అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరు. కేవలం తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే అబద్దాలు చెబుతారు. వీరు చెప్పే అబద్దాలు చాలాసార్లు వారినే ఇబ్బందుల్లోకి నెడతాయి.