Health Tips: మీకు ఈ 7 అలవాట్లు ఉన్నాయా?.. అయితే వెంటనే మానేయండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..
Health Tips: కిడ్నీ.. మన శరీరంలో కీలకమైన అవయవం. శరీరంలోని విషపదార్థాలను, మలినాలను బయటకు పంపిస్తుంది. అంతేకాదు.. శరీరంలో నీరు, ఉప్పు, ఖనిజాలు సమతుల పరిమాణంలో...
Health Tips: కిడ్నీ.. మన శరీరంలో కీలకమైన అవయవం. శరీరంలోని విషపదార్థాలను, మలినాలను బయటకు పంపిస్తుంది. అంతేకాదు.. శరీరంలో నీరు, ఉప్పు, ఖనిజాలు సమతుల పరిమాణంలో ఉంచడానికి ఇది సహాయపపడుతుంది. ఒకవేళ కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే.. శరీరంలోని నరాలు, కణాలు, కండరాలు క్రమంగా దెబ్బతింటాయి. తుదకు ప్రాణాలకే ముప్పు వాటిళ్లే అవకాశం ఉంది. అందుకే.. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ చెడు అలవాట్లు ఉంటే.. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాగే.. మనం తినే కొన్ని పదార్థాలు కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయి. మరి కిడ్నీలను ప్రభావితం చేసే చెడు అలవాట్లు, ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అతిగా పెయిన్ కిల్లర్స్ వాడటం.. చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటాయి. అయితే, చిన్నపాటి పెయిన్స్‌కే తట్టుకోలేక చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. కానీ, అలా తీసుకోవడం కిడ్నీలకు పెను ముప్పు వాటిళ్లుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకించి మీకు అప్పటికే ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే.. వైద్యుడిని సంప్రదించిన తరువాతే పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి ఉంటుంది.
2. ఆహారంలో ఎక్కువ ఉప్పు తినడం.. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే.. రక్తపోటు సమస్య పెరుగుతుంది. అలాగే కిడ్నీపైనా దాని ప్రభావం ఉంటేంది. అందుకే అధిక ఉప్పు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఆహారంలో ఉప్పు కంటే మసాలా దినుసులు, మూలికలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. దీని ద్వారా ఫుడ్‌లో ఉప్పు అధికంగా తినడం తగ్గిస్తారట.
3. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. ప్రాసెస్ చేయబడిన ఆహారంలో సోడియం, భాస్వరం అధికంగా ఉంటుంది. మీకు ఇదివరకే కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే.. ప్యాక్ చేసిన/ప్రాసెస్డ్ ఫుడ్‌ని తీసుకోవడం మానుకోవాలి. అధిక మొత్తంలో భాస్వరం తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం మూత్రపిండాలు, ఎముకలను త్వరగా దెబ్బతీస్తుంది.
4. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచకపోవడం.. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లాలంటే.. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. రోజూ తగినంత నీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. అయితే, మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. కానీ కిడ్నీ ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి రోజూ.. 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి.
5. తగినంత నిద్ర లేకపోవడం.. మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర పోవడం ద్వారా మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సమయానికి నిద్రపోకపోయినా.. తగిన నిద్ర లేకపోయినా అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.
6. చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం.. చక్కెర పదార్థాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఇది కాకుండా, అధిక రక్తపోటు, మధుమేహం పెరగడానికి కారణమవుతుంది. అలాగే.. కిడ్నీ సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా బిస్కెట్లు, తెల్ల రొట్టె వంటి స్టార్చ్ ఉత్పత్తులను ఆహారంలో తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ముందు, దాని లేబుల్‌ను పూర్తిగా చదవాలని సూచిస్తున్నారు.
7. ధూమపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం చేసే వారి మూత్రంలో ఒకరకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. అందుకే ధూమపానానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also read:
O Kalyan On MAA Elections: బయట అరుచుకుంటారు.. లోపల కౌగిలించుకుంటారు ఇది సినీ మా..య అంటున్న ఓ కళ్యాణ్
MAA Elections 2021: ‘మా’ ఎన్నికల ఓటింగ్ వేళ కనిపించిన ఇంట్రస్టింగ్ చిత్రాలివే..