O Kalyan On MAA Elections: బయట అరుచుకుంటారు.. లోపల కౌగిలించుకుంటారు ఇది సినీ మా..య అంటున్న ఓ కళ్యాణ్

O Kalyan On MAA Elections: మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల ఓటింగ్ ముసిగింది. తాజాగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈసారి మా అధ్యక్ష పోటీలో సీనియర్..

O Kalyan On MAA Elections: బయట అరుచుకుంటారు.. లోపల కౌగిలించుకుంటారు ఇది సినీ మా..య అంటున్న ఓ కళ్యాణ్
O Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Oct 10, 2021 | 7:05 PM

O Kalyan On MAA Elections: మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల ఓటింగ్ ముసిగింది. తాజాగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈసారి మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణులు ఓ రేంజ్ లో తలపడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలపై నిర్మాత నటుడు ఓ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు. అసలు మా ఎలక్షన్స్  లో జరుగుతుందని అంతా డ్రామాగా అభివర్ణించారు. ఇప్పటి వరకూ ఈ చిన్న యూనియన్ ఎలక్షన్స్ లో కూడా ఇంత రచ్చ జరగలేదని .. ఇదంతా డ్రామా.. తెలుగు ప్రజల్ని మోసం చేయడమే నని చెప్పారు.

ఈ ఎన్నికల్లో జరిగిందంతా సినీ మా..య.. ఇండస్ట్రీలో పెద్దలు బయట అరుచుకుంటారు..లోపలికి వెళ్ళి కౌగిలించుకుంటారని సంచలన కామెంట్స్ చేశారు. అసలు సినీ పెద్దల తీరు కరెక్ట్ కాదని నీతిగా ఉండాలని సూచించారు. ఇంత చిన్న అసోసియేషన్ కి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా పెద్దలు చేయవచ్చు. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవీ పెద్దలు చేయలేదు. మాకు మేము చేసుకున్న రచ్చ ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అధ్యక్షుడుగా పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ కి ఇది పద్దతి కాదు అని కూడా చెప్పాను… వినలేదన్నారు ఓ కళ్యాణ్. అయినా కౌంటింగ్ జరుగుతుందిగా మరికొన్ని గంటల్లో ఎవరిదీ గెలుపో తెలుస్తుంది.. చూద్దాం అంటూ సినీ పెద్దలపై సంచలన కామెంట్స్ చేశారు ఓ కళ్యాణ్.

Also Read: Vijay Devarakonda: ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం భక్తులు ఉత్సాహం