MAA Elections 2021: ‘మా’ ఎన్నికల ఓటింగ్ వేళ కనిపించిన ఇంట్రస్టింగ్ చిత్రాలివే..
'మా' ఎన్నికల ఓటింగ్ వేళ...వెరైటీ సీన్స్ కనిపించాయి. అభిమానులు, ప్యానల్ సభ్యులు ఊహించినట్లుగా కాకుండా 'మా' సభ్యత్వం కలిగిన వాళ్లంతా ఓటు వేసేందుకు వచ్చారు.
‘మా’ ఎన్నికల ఓటింగ్ వేళ…వెరైటీ సీన్స్ కనిపించాయి. అభిమానులు, ప్యానల్ సభ్యులు ఊహించినట్లుగా కాకుండా ‘మా’ సభ్యత్వం కలిగిన వాళ్లంతా ఓటు వేసేందుకు వచ్చారు. ముఖ్యంగా టాప్ స్టార్‌లుగా ఉన్నటువంటి మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓటు వేశారు. ఓటేసేందుకు వచ్చిన సమయంలో పవన్ కల్యాణ్ అటు ప్రకాష్‌రాజ్‌తో చర్చిస్తూనే మంచు మనోజ్‌ని హగ్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఓటు వేశారు. ఎన్నికలు ఇంత పోటాపోటీగా జరగడం మంచిదేనన్నారు చిరంజీవి.
ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా…డైరెక్ట్‌గా విష్ణు దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారు. అటుపై అక్కడే ఉన్న మోహన్‌బాబుని రెస్పెక్ట్ చేస్తూ పలకరించారు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా బ్లాక్ డ్రెస్‌లో రావడం ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి. నందమూరి నటుల్లో బాలకృష్ణ వచ్చారు. ‘మా’ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్ విష్ చేసినప్పటికి ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
ఢిల్లీ నుంచి వచ్చిన జయప్రద పోలింగ్ బూత్‌కి రాగానే మంచు మనోజ్‌ని పలకరించారు. ఆమె మోహన్‌బాబుతో కలిసి సరదాగా ముచ్చటించారు. అటు ముంబై నుంచి ఓటేసేందుకు వచ్చిన జెనిలియాను విష్ణు వెంట తీసుకొని వచ్చారు. నటి పూనమ్‌కౌర్ ఓటేసేందుకు వచ్చి ప్రకాష్‌రాజ్‌ని హగ్ చేసుకున్నారు. నిత్యామీనన్, రోజా, రాశి, ప్రియమణి, రాశిఖన్నా, ఇంద్రజ…ఇలా అందరూ వచ్చి తమ ఓటు వేశారు. శ్రీకాంత్ సతీమణి ఊహను విష్ చేశారు నటి ప్రగతి.
Also Read: రకుల్ పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ ఎవరు..? అతని గురించి కీలక విషయాలు
‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.