Rakul Preet Singh: రకుల్ పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ ఎవరు..? అతని గురించి కీలక విషయాలు

కెరీర్‌ పీక్ స్టేజ్‌లోొ ఉండగా పెళ్లి దిశగా అడుగులేయబోతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఆమె కొండపొలం చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది.

Rakul Preet Singh: రకుల్ పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ ఎవరు..? అతని గురించి కీలక విషయాలు
Jackky Bhagnani Rakul
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 4:19 PM

కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి దిశగా అడుగులేయబోతుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఆమె కొండపొలం చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది. తాజాగా తన ప్రియుడితో కలిసున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ బ్యూటీ.. త్వరలో అతనితో లైఫ్ షేర్ చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది.  జాకీ భగ్నానీ అనే నటుడితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రకుల్ తన 31 పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. జాకీ భగ్నానీ కూడా ఇన్ స్టా పోస్ట్ ద్వారా రకుల్‌పై తన ప్రేమను తెలియజేశాడు.  వీరికి కృతి సనమ్, టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్ ఆయుష్మాన్ ఖురానా  వంటి చాలామంది సెలబ్రిటీస్ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో అసలు ఈ జాకీ భగ్నానీ ఎవరని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అతడి గురించి కొంత సమాచారం ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాం.

జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఈయన కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించారు. పూజా ఎంటర్టైన్‌‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ మూవీస్ నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ హిందీ మూవీలో ఇండస్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. 2016లో సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా కూడా తన అభిరుచి చాటుకున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్, రణ్ దీప్ హుడా కీ రోల్స్‌లో నటించారు. కాగా త్వరలో జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్  రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించనున్నాడు. కాగా ఇతడు కూడా రకుల్‌లాన్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు… స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?