MAA Elections 2021: ‘మా’ ఎన్నికల పోలింగ్ గంట పొడిగింపు.. పోలీసుల లాఠీఛార్జ్.. లేటెస్ట్ అప్‌డేట్

ఓ వైపు తోపులాటలు, మరో వైపు ఉద్రిక్తత మధ్య పోలింగ్‌ నడుస్తోంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఇరు వర్గాలు విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి.

MAA Elections 2021: 'మా' ఎన్నికల పోలింగ్ గంట పొడిగింపు.. పోలీసుల లాఠీఛార్జ్.. లేటెస్ట్ అప్‌డేట్
Maa War
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 2:50 PM

మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ముగియాల్సిన పోలింగ్‌ను మరో గంట పాటు పొడిగించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనుంది. రెండు ప్యానెల్స్ అధ్యక్ష అభ్యర్థులు ప్రకాశ్ రాజ్, విష్ణుతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. అయితే.. షెడ్యూల్‌ ప్రకారం.. 4 గంటల నుంచి కౌంటింగ్ మొదలవ్వాల్సి ఉంటుంది. ఆ సమయాన్ని కూడా గంట పొడిగిస్తారా.. లేదా.. అన్నది కాసేపట్లో స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు 545 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్‌లో లాఠీలకు పని చెప్పారు పోలీసులు. క్రౌడ్ ఎక్కువగా ఉండటం, కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన పోలింగ్‌ కాస్తా.. హీట్ ఎక్కింది. పోలింగ్ ముగిసే సమయంలో కొంత గందరగోళం ఏర్పడింది.

ఓ వైపు తోపులాటలు, మరో వైపు ఉద్రిక్తత మధ్య పోలింగ్‌ నడుస్తోంది. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఇరు వర్గాలు విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. నిన్నటి వరకు ఒక ఎత్తు. ఇవాళ మరో ఎత్తు అన్నట్లుగా వ్యవహరించారు మా సభ్యులు. ఓ వైపు మా ఒక్కటే, మీమంతా ఒక్కటే అంటూ సన్నాయిరాగాలు తీస్తూనే.. కడుపులో ఉన్న విషాన్ని సందర్భానుసారంగా వెళ్లగక్కారు.

నిన్నటి వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఎలా ఉన్నా.. ఉదయం 8 గంటలకు సాఫిగా ప్రారంభమైంది మా ఎన్నికల పోలింగ్. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఎంత మంచి వాళ్లూ అన్నట్లుగా పోలింగ్ మొదలు పెట్టారు. 8 గంటలకు ముందే కొందరు సభ్యులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటే.. ఆ తర్వాత ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. తమకున్న ఓటు హక్కును వినియోగించుకుంటూ జై మా అంటూ వెనుదిరిగారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగొచ్చన్న అంచనాలు అందాయి. ఇది తొలి గంట సీన్.

ఉదయం 9 గంటల సమయంలో.. అప్పటికే క్రమంగా క్రౌడ్ పెరిగింది. ఓటు హక్కు ఉన్న వాళ్లు, లేని వాళ్లు, కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, సెక్యూరిటీతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు తోపులాటలు, గందరగోళం, గడబిడ మొదలైంది. ఓ దశలో తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఫైటింగ్‌కు దిగినంత పని చేశాయి. తమ ప్యానెల్ మాత్రమే గెలవాలన్నట్లుగా దూకుడు ప్రదర్శించారు కంటెస్ట్స్ అనుచరులు. మా పోలింగ్ జరుగుతున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఫైటింగ్ సీన్ కనిపించింది. ఈ క్రమంలో పోలీసులు కలుగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. రెండో గంట ముగిసే సరికి పోల్ సీన్ హీటెక్కింది.

సమయం 10 గంటలు అవుతోంది. అప్పటికే ఆ వాతావరణం అంతా ఉద్రిక్తంగా కనిపించింది. కడుపులో మంట హేమ రూపంలో బయటపడింది. ఏకంగా శివబాలాజీ చేయి పట్టుకొని కొరికింది హేమ. మా పోలింగ్‌లో ఇలాంటి సీన్స్ కూడా చూడాల్సి వస్తుందా అంటూ అందరూ అవాక్కయ్యారు. ఆ సీన్‌ చూసి అంతా ఖంగుతిన్నారు.

సమయం 11 గంటలు అవుతుంది. ఆ సీన్‌పై రకరకాల ఎక్స్‌ ప్లేషన్స్, రకరకాల కామెంట్స్ అనంతరం.. అంతా పోలింగ్ పై దృష్టి పెట్టారు. అయ్యిందేదో అయ్యింది. వచ్చేది లేదు, పోయ్యేది లేదు అంటూ పోలింగ్ మీద దృష్టి పెట్టారు. వచ్చే సభ్యులు ఎవరు? తమకు అనుకూలంగా ఓటు వేసే వారు ఎవరు అనే క్రమంలో పోలింగ్ ఫోకస్ పెట్టారు.

Also Read: పార్క్‌లో సరదాగా వాకింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ… ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది

ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్