Rakul Preet Singh: ప్రేమికుడిని పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువ హీరోల దగ్గర నుంచి టాప్ హీరోల..

Rakul Preet Singh: ప్రేమికుడిని పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. నెట్టింట ఇన్‌స్టా పోస్ట్ వైరల్..
Rakul Preet
Follow us
Ravi Kiran

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 10, 2021 | 3:06 PM

టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే సందర్భంగా తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా జాకీ భగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. బాలీవుడ్ హీరో జాకీ భగ్ననీ ”లవ్ ఆఫ్ మై లైఫ్” అంటూ రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అది కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

”థాంక్యూ మై లవ్. ఈ ఏడాది నువ్వే నా అతిపెద్ద గిఫ్ట్. నా జీవితానికి రంగులద్దావ్. నన్ను ఎలప్పుడూ నవ్వించావ్. అన్నింటికీ థాంక్యూ. నీలా నువ్వు ఉన్నందుకు థాంక్యూ. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు పోగేసుకుందాం” అంటూ జాకీతో గడిపిన సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ రకుల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ జంటకు కంగ్రాట్స్ తెలుపుతూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే జాకీ భగ్నాని.. రకుల్‌కి బర్త్‌డే విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. ”నువ్వు లేకపోతే..రోజులు రోజులుగా అనిపించవు. నువ్వు లేకపోతే.. అత్యంత రుచికరమైన ఆహారాన్ని తినడంలో సరదా ఉండదు. నా ప్రపంచం అయిపోయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ రోజు నీ చిరునవ్వులాగే.. అందంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ జాకీ పోస్ట్ చేశాడు.

కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్న రకుల్.. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది.

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు… స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.