AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు… స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

వారు ప్రేమలో ఉన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. డబ్బు సరిపోవడం లేదు. ఈజీ మనీ కావాలి. అందుకే చోరీల బాట పట్టారు.

ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు... స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్
Thieves
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2021 | 9:35 PM

Share

వారు ప్రేమలో ఉన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. డబ్బు సరిపోవడం లేదు. ఈజీ మనీ కావాలి. అందుకే చోరీల బాట పట్టారు. అందులో కూడా వినూత్నమైన రూట్ ఎంచుకున్నారు. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి.. ఓనర్స్‌ను ఏమార్చి.. ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించేవారు.  కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా  గుర్తించారు పోలీసులు. వీరిద్దరికీ 3 సంవత్సరాల క్రితం పరిచయమైంది. వినయ్​పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడని.. ఇప్పటికే రౌడీషీట్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని లవ్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. ప్రస్తుతం వినయ్-కీర్తనలు లవ్‌లో ఉన్నారని.. తనను లాంగ్​డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, కాస్ట్లీ గిఫ్ట్‌లు ఇవ్వాలని కీర్తన వినయ్​ని ఒత్తిడి చేసేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే దొంగతనాలు చేసేవాడని .. వీటికోసం ఆమెనూ తీసుకువెళ్లేవాడని తేలింది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ క్రైమ్ కపుల్.. ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్‌గా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. అనంతరం ఓనర్ దృష్టిని మరల్చి ఒక మొబైల్​ఫోన్, ల్యాప్​టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు. తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: హైదరాబాద్‌కు హైఅలెర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు!

మూసీలో మొస‌లి కలకలం… భ‌యాందోళ‌న‌లో స్థానికులు

ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?