Crocodile in musi: మూసీలో మొస‌లి కలకలం… భ‌యాందోళ‌న‌లో స్థానికులు

హైదరాబాద్‌లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివశించేవారికి అలెర్ట్. ఆయా ఏరియాల్లో ముసళ్ల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా  అత్తాపూర్ వద్ద....

Crocodile in musi: మూసీలో మొస‌లి కలకలం… భ‌యాందోళ‌న‌లో స్థానికులు
Crocodiles In Musi
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 4:42 PM

హైదరాబాద్‌లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివశించేవారికి అలెర్ట్. ఆయా ఏరియాల్లో ముసళ్ల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా  అత్తాపూర్ వద్ద మూసీలో మొసలి స్థానికులను టెన్షన్ పెట్టించింది. హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ వరదలో మొసలి కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. మొసలిని గమనించిన స్థానికులు.. జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. సైన్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొసలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. గతంలో కిస్మత్‌పూర్ శివారులోనూ 2 మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు.

నేడు కూడా నగరంలో భారీ వర్షం శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోనే లేదు. శివారు కాలనీల్లో ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. కానీ జీహెచ్‌ఎంసీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించిందగి జీహెచ్‌ఎంసీ. ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు అధికారులు. అంతేకాకుండా అన్ని డిపార్ట్‌మెంట్లను అప్రమత్తం చేసింది జీహెచ్‌ఎంసీ.

Also Read:  హైదరాబాద్‌కు హైఅలెర్ట్.. మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు!

‘తెర’వెనుక రాజకీయం.. ఇప్పుడే మొదలైన అసలు సిసలు ‘మా’ యుద్ధం