AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: మేఘం గర్జించింది.. నిండా ముంచేసింది.. ఆ భీకర దృశ్యాలు ఇలా..

సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. థియేటర్ యాజమాన్యంతో ఆందోళనకు దిగారు. నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు..

Hyderabad Rains: మేఘం గర్జించింది.. నిండా ముంచేసింది.. ఆ భీకర దృశ్యాలు ఇలా..
Hyderabad Rains
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2021 | 1:11 PM

Share

శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోనే లేదు. శివారు కాలనీల్లో ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. కానీ జీహెచ్‌ఎంసీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించిందగి జీహెచ్‌ఎంసీ. ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు అధికారులు. అంతేకాకుండా అన్ని డిపార్ట్‌మెంట్లను అప్రమత్తం చేసింది జీహెచ్‌ఎంసీ. దిల్ సుఖ్ నగర్ శివ గంగ థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు.. సెకండ్ షో కనిపించింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కాంపౌండ్ వాల్ కూలి.. ఏకంగా 50 బైక్‌లు నుజ్జు నుజ్జయ్యాయి.

సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. థియేటర్ యాజమాన్యంతో ఆందోళనకు దిగారు. నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు కలగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Bikes Damage

Bikes Damage

నిన్న రాత్రి వరుణుడు మెరుపులా దండెత్తాడు. నగరం నదిలా మారింది. హైదరాబాద్ .. హైజలాబాద్.. అయింది. రోడ్డేదో తెలీదు.. డ్రైనేజ్ ఎక్కడుందో అర్ధం కాలేదు. జోరు వానలో.. చిమ్మ చీకట్లో జీహెచ్‌ఎంసీ వాసులు పడరాని పాట్లు పడ్డారు. చంపాపేట్‌, బాలాపూర్‌ కాలనీలు నీటమునిగాయి. సరూర్‌నగర్‌లో 18 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీ కాలనీలో మోకాళ్ల లోతు వర్షపు నీరు ప్రవహిస్తోంది. హయత్‌నగర్, తొర్రూర్ మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యాయి.

హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై వరదనీరు నీలిచిపోయింది. ఆరాంఘర్-శంషాబాద్‌ రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్‌-బెంగళూరు రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. మిథిలా నగర్‌లో పాతాళ గంగ పొంగినట్టు డ్రైనేజీ పొంగుతోంది.

పాతబస్తీలోని నవాబ్ షేక్ కుంటలో ఇళ్లలోకి నడుముల్లోతు నీళ్లు వచ్చాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుర్కయాంజల్ సమీపంలో ఉన్న కాలువ ఉప్పొంగి ప్రవహించడంతో.. రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇదిలావుంటే మరో రెండు రోజుల పాటు వర్షాలు పడితే పరిస్థితి మరింత చేయిదాటిపోయే పరిస్థితి నెలకొంది.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు..

CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్‌ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..

Facebook Apologised: అంతరాయానికి చింతిస్తున్నాం.. మరోసారి సారీ.. చెప్పిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్..

Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..