AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్‌ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.

CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్‌ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..
Cm Jagan
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2021 | 9:15 AM

Share

ప్రధాని మోడీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. ఏపీ కోసం యద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలను వివరించారు ముఖ్యమంత్రి. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌. కోవిడ్ అనంతరం విద్యుత్ డిమాండ్ పెరిగిందని లేఖలో వివరించారు ముఖ్యమంత్రి. గత ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 15 శాతం పెరిగిందని ప్రధానికి రాసిన లేఖలో వివరించారు సీఎం జగన్. సెప్టెంబర్ నెలలోనే విద్యుత్‌ డిమాండ్‌ 20 శాతానికి పైగా పెరిగిందన్నారు జగన్‌మోహన్‌రెడ్డి. కొన్నిసార్లు విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే యూనిట్‌కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు ఏపీ ముఖ్యమంత్రి. కొవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం మేర పెరిగిందని వివరించారు సీఎం.

బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళవ వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఏపీ జెన్ కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేరకు తీర్చుగలుగుతోందని వివరించారు జగన్. 1-2 రోజుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు లేఖలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని మోదీకి వివరించారు జగన్.

రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో, ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు సీఎం జగన్. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రోజుకు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు సీఎం. ఏపీ అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేయాలని భావించినా అందుబాటులో ఉండటం లేదని అన్నారు ముఖ్యమంత్రి.

ఏపీ థర్మల్‌ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని ప్రధానిని కోరారు జగన్‌మోహన్‌రెడ్డి. పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు ఏపీ సీఎం. ఓఎన్‌జీసీ, రియలన్స్‌ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్‌ సరఫరా చేయాలని సీఎం కోరారు జగన్.

విద్యుత్‌ డిస్కంలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు ఏపీ ముఖ్యమంత్రి. కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్లు ఉత్పత్తి చేయాలని ప్రధానికి రాసిన లేఖలో కోరారు సీఎం జగన్‌.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్