Hyderabad Rains: దట్టంగా కమ్మిన మబ్బులు.. గర్జిస్తోన్న మేఘాలు.. హైరదాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం

Hyderabad Weather Update: శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం నుంచి హైదరాబాద్ నగరం ఇంకా తేరుకోనే లేదు. జోరు వానలో.. చిమ్మ చీకట్లో జీహెచ్‌ఎంసీ వాసులు పడరాని పాట్లు పడ్డారు. మొత్తం వందకుపైగా కాలనీలు జలమయం అయ్యాయి.

Hyderabad Rains: దట్టంగా కమ్మిన మబ్బులు.. గర్జిస్తోన్న మేఘాలు.. హైరదాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం
Hyderabad Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 09, 2021 | 4:47 PM

హైదరాబాద్ ప్రజలకు హైఅలెర్ట్. నేడు కూడా భారీగా వర్షం దంచికొట్టే అవకాశం ఉన్నట్లు హైదరాబాాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అలెర్టయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎక్కడికి ఎవ్వరూ బటకి వెళ్ళ వద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్ర నంబర్ 040-21111111 కు సంప్రదించాలని ప్రజలను అధికారులు కోరారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. అదే విధంగా ఈ రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.

శుక్రవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోనే లేదు. జోరు వానలో.. చిమ్మ చీకట్లో జీహెచ్‌ఎంసీ వాసులు పడరాని పాట్లు పడ్డారు. మొత్తం వందకుపైగా కాలనీలు జలమయం అయ్యాయి. శివారు కాలనీల్లో ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. అనేక కాలనీలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. కానీ జీహెచ్‌ఎంసీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ మధ్యాహ్నం తర్వాత మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శివారు కాలనీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.

హయత్ నగర్ శివారు కాలనీలైన బంజారా కాలనీ, వెంకటరమణ కాలనీ, బ్రాహ్మణపల్లి, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. దాదాపు 950 కుటుంబాలు వరద నీటిలోనే నానుతున్నాయి. వర్షం ప్రతిసారి చెరువులు పొంగి.. కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. గడ్డి అన్నారం పరిసర ప్రాంతాల్లోనూ.. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భంధంలోనే చిక్కుకున్నాయి. వరద నీరు చుట్టు ముట్టడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దిల్ సుఖ్ నగర్ శివ గంగ థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకు.. సెకండ్ షో కనిపించింది. రాత్రి కురిసిన వర్షానికి కాంపౌండ్ వాల్ కూలి.. ఏకంగా 50 బైక్‌లు నుజ్జు నుజ్జయ్యాయి.

చంపాపేట్‌, బాలాపూర్‌ కాలనీలు నీటమునిగాయి. సరూర్‌నగర్‌లో 18 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీ కాలనీలో మోకాళ్ల లోతు వర్షపు నీరు ప్రవహిస్తోంది. హయత్‌నగర్, తొర్రూర్ మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై వరదనీరు నీలిచిపోయింది. ఆరాంఘర్-శంషాబాద్‌ రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్‌-బెంగళూరు రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. మిథిలా నగర్‌లో పాతాళ గంగ పొంగినట్టు డ్రైనేజీ పొంగుతోంది.

Also Read:  రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. దసరా రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు

అనంతలో వాట్సప్ మెసేజ్ కలకలం.. క్షణాల్లో పోలీసుల రియాక్షన్.. సీన్ కట్ చేస్తే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే