Railway News: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. దసరా రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు

South Central Railway: దసరా సందర్భంగా రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్‌ల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపుంది.

Railway News: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. దసరా రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు
Railway Passenger Alert
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 08, 2021 | 6:56 PM

Railway Passenger Alert: దసరా సందర్భంగా రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్‌ల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపుంది. దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలను తెలిపింది. మహారాష్ట్రలోని పూర్ణ రైల్వే జంక్షన్ – తిరుపతికి మధ్య ఈ నెల 11 తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. పూర్ణ నుంచి తిరుపతికి 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నపడనుండగా.. తిరుపతి నుంచి పూర్ణకు 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రోజుల్లో పూర్ణ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 గం.కు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 8 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.

అలాగే పైన తెలిపిన తేదీల్లో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8.15 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు.. మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గం.లకు పూర్ణ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

అలాగే సికింద్రాబాద్-అగర్తలా మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నెల 11 తేదీన (సోమవారం) మధ్యాహ్నం 4.35 గం.లకు సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు ఓ ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లనుంది. ఈ ప్రత్యేక రైలు గురువారం వేకువజామున 3 గం.లకు అగర్తలా చేరుకుంటుంది. అలాగే ఈ నెల 15న ఎదురుదిశలో అగర్తలా నుంచి సికింద్రాబాద్‌కు ఓ ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇది అగర్తలా నుంచి 15 తేదీన(శుక్రవారం) ఉదయం 6.10 గం.లకు బయలుదేరి.. శనివారం మధ్యాహ్నం 2.50 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.

అలాగే సికింద్రాబాద్-నర్సాపురం మధ్య, సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి 14వ తేదీన రాత్రి 10.55 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 10 గం.లకు నర్సాపురం చేరుకుంటుంది. అలాగే నర్సాపురం నుంచి సికింద్రాబాద్‌కు 17వ తేదీన సాయంత్రం 6 గం.లకు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు వేకువజామున 4.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

14వ తేదీన రాత్రి 8 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 7 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. అలాగే 17వ తేదీన రాత్రి 8.45 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8.25 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

Also Read..

Navratri 2021: దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. పూజారి ఛాతీపై 21 కలశాల స్థాపన.. ఎక్కడంటే

Ratan TATA: ఆనాటి వైభవాన్ని తిరిగి పొందుతాం.. ఎయిర్‌ ఇండియాను దక్కించుకోవడంపై స్పందించిన రతన్‌ టాటా..

Bathukamma: ఆడపడుచులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత