AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathukamma: ఆడపడుచులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఇవాళ ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో

Bathukamma: ఆడపడుచులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత
Telangana Governor Bathukam
Venkata Narayana
|

Updated on: Oct 08, 2021 | 5:15 PM

Share

Telangana Governor Tamilisai: తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ వేడుకలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఇవాళ ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు ఎమ్మెల్సీలు కవిత, వాణిదేవి ఈవేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులతో కలిసి గవర్నర్ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఆడపడుచులు మూడవ రోజూ ఘనంగా జరుపుకుంటున్నారు.

మొత్తం 9 రోజులు పాటు తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే బతుకమ్మ పండుగలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈవేడుకల్ని నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించారు. ప్రకృతిలో పూసిన తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల ముందు గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణిదేవితో పాటు మహిళలు పాటలు పాడి బతుకమ్మ ఆడారు.

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గవర్నర్ తమిళిసై. ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నప్పటికి బతుకమ్మ తెలంగాణకి మాత్రమే పరితమైన గొప్ప పండుగ అని ఆమె కొనియాడారు. మన పూర్వికుల భాష, అలవాట్లను మనం అలవర్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.

తెలుగు యూనివర్సిటీలో గవర్నర్‌తో కలిసి బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవతి. తెలంగాణా.. తెలుగు బాష మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం తెలుగు యూనివర్సిటీ అధికారులు కృషి చేయాలని కోరారు కవిత.

రాష్ట్రంలోని మహిళలంతా ఈ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని.. తెలంగాణ సంప్రదాయాన్ని దశదిశలా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికి నవరాత్రి, బతుకమ్మ శుభకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Bathukamma

Read also: Nobel Peace Prize 2021: జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్‌లకు నోబెల్ శాంతి బహుమతి