Telangana CM KCR: ఫసల్ బీమా పథకంపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..

Telangana CM KCR: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు..

Telangana CM KCR: ఫసల్ బీమా పథకంపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us

| Edited By: Venkata Narayana

Updated on: Oct 08, 2021 | 4:57 PM

Telangana CM KCR: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు శాస్త్రీయంగా లేదని కుండబద్దలు కొట్టారు. ఫసల్ బీమా అంతా బోగస్ అని సంచలన కామెంట్స్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఫసల్ బీమా యోజన పథకంలో రైతులకు ఏమాత్రం లాభం చేకూరడం లేదని విమర్శించారు. ఈ పథకానికి సవరణలు సూచిస్తూ కేంద్రానికి సూచనలు పంపిస్తామని అన్నారు.

అంతేకాదు.. వ్యవసాయం, ఆహార ధాన్యాల నిర్వహణ వంటి అంశాలపై కేంద్రానికి పలు సూచనలు చేస్తామని అన్నారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా దేశ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందని శాసనసభ వేదికగా కేంద్రానికి సీఎం కేసీఆర్ సూచించారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు వలన ఆహార ధాన్యాల నిల్వ సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా.. ఆహార ధాన్యాల కొతర ఏర్పడిన సమయాల్లో ధాన్యాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయరంగం గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకూడదని, రైతు రాజు అయ్యే అవసరమైన పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చామన్నారు. ఈ పోర్టల్ ద్వారా రైతులకు చాలా ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. అలాగే ఇటీవల గులాబ్ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. గులాబ్ తుపాను బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో నష్టం అంచనాపై కేంద్రానికి నివేదికలు అందిస్తామని చెప్పారు. రైతులు అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Also read:

Pawan Kalyan vs YCP: తాకట్టులో ఆంధ్రప్రదేశ్.. జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ విసుర్లు..

Allu Arjun: శంకర్‌పల్లిలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సందడి.. తహశీల్దార్‌ ఆఫీసుకు క్యూ కట్టిన అభిమానులు

Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన ‘వరుడు కావలెను’..?