Micro-chip Fraud: అంతా మాయ.. వాహనదారులు చూసేదంతా మాయ.. పెట్రోల్ బంకుల్లో ‘మైక్రో చిప్’ మోసం.. కోట్లల్లో..
Micro-chip Fraud at Petrol Bunks: అంతా మాయ.. మీరు చూసేదంతా మాయే.. మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్.. అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.. కానీ మీరు మాత్రం
Micro-chip Fraud at Petrol Bunks: అంతా మాయ.. మీరు చూసేదంతా మాయే.. మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్.. అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.. కానీ మీరు మాత్రం పక్కాగా మోసపోతారు.. మన కళ్ల ముందు మనకు తెలియకుండానే మోసం జరుగుతుంది. ఇదేమీ మాయా మంత్రం కాదు.. గారడీ అస్సలే కాదు.. అదెలాగంటారా? అదే మైక్రో చిప్ మాయ.. ఇది కచ్చితంగా వాహనదారులు తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..? పెట్రోల్ బంకుల్లో జరిగే మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే చిప్ మాయ.. మీ వాహనంలో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే.. మీకు పోసింది 1000ML కాదు… 950ML మాత్రమే.. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటి, డిస్ ప్లేలో లీటర్ చూపించింది కదా అనుకుంటున్నారా? మరి, అదే మాయ. మీకు తెలియకుండానే మీ పెట్రోల్ లో నుంచి 50 ఎల్ఎల్ కొట్టేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల్లో మైక్రో మాయ ఒకటి. దీని ద్వారా మన కళ్ల మందే మనకు తెలియకుండా మన పెట్రోల్, డిజీల్ కొట్టేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. ఒకే ఒక్క చిన్న చిప్‌తో దర్జాగా దోపిడీకి పాల్పడతారు. లీటరుకు యాభై నుంచి హండ్రెడ్ ఎంఎల్ కొట్టేస్తున్నారని తేలింది.
ఒకవైపు పెరిగిన పెట్రో ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంటే… మరోవైపు బంకు యజమానులు మైక్రో చిప్స్‌తో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మైక్రో చిప్ మాయగాళ్లు దేశమంతటా ఉన్నారు. అయితే, ఇలాంటి ముఠాలు ఎక్కువగా హైదరాబాద్, తెలంగాణలోనే ఉన్నట్లు తేలింది. గప్‌చుప్‌గా సాగుతోన్న మైక్రో చిప్ మోసాలపై హైదరాబాద్‌లో తీగ లాగితే మూడు రాష్ట్రాల్లో డొంక కదిలింది. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో మొత్తం 34 బంకుల్లో ఈ మైక్రో చిప్స్ అమర్చినట్లు ముఠా ఒప్పుకుంది. తెలంగాణలో కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మైక్రో చిప్స్ అమర్చినట్లు నిందితులు చెప్పడంతో స్టేట్ వైడ్‌గా రైడ్స్ చేశారు. ఖమ్మం వైరాలో చిప్స్‌తో మోసాలకు పాల్పడుతోన్న పెట్రోల్ బంక్‌ను పోలీసులు సీజ్ చేశారు.
మీరు కొట్టించుకున్న పెట్రోల్‌కు రావాల్సినంత మైలేజ్ రాకపోతే మీరు మోసపోతున్నట్టే. చిప్పులతో మీ జేబుకు చిల్లు పెట్టేశారని గుర్తించాలి. అనుమానం వస్తే నిలదీయండి. వెంటనే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఒక్కో బంకులో రోజుకి 1000 లీటర్ల వరకు మోసం జరుగుతుందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌తో చిన్న చిప్ అమర్చి.. లీటరుకు 50ML, 100 లీటర్లకు 5 లీటర్లు మాయం చేస్తున్నారన్నారు. రోజుకి బంకు యజమానులు లక్షలు దండుకుంటున్నారని పేర్కొంటున్నారు.
ఇంతకీ ఈ మైక్రో మాయేంటంటే..? 1. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తారు 2. మదర్ బోర్డ్ అండ్ డిస్ ప్లేలో మైక్రో చిప్స్ 3. ఆపరేటర్ చేయడానికి రెండు కీలు పెడతారు 4. ఒకటి ఒరిజినల్… రెండోది మైక్రో కీ… 5. ఆన్ ఆఫ్ అంతా బంకు ఆపరేటర్ల చేతిలోనే 6. మైక్రో చిప్ ఆన్‌లో ఉంటే లీటరుకు 50ML మోసం 7. ఎవరైనా తనిఖీలకు వస్తే క్షణాల్లో మార్చేస్తారు 8. ఆన్ ఆఫ్ చేస్తే చాలు ఒరిజినల్ సెట్టింగ్స్ 9. దేశవ్యాప్తంగా మైక్రో చిప్ ముఠాలు 10. బంక్ ఓనర్స్‌తో డీల్స్ చేసుకుని మోసాలు
మోసాన్ని ఎలా గుర్తించాలి? 5 లీటర్ల కొలతతో గుర్తించొచ్చు ప్రతి పెట్రోల్ బంకులో 5 లీటర్ల కొలత 5 లీటర్లు కరెక్ట్‌గా వస్తే సరిగా ఉన్నట్టు కంప్లైంట్ సెల్ నెంబర్ 9398977514
Also Read: