Nobel Peace Prize 2021: జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్‌లకు నోబెల్ శాంతి బహుమతి

జర్నలిస్టులు.. మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్‌లకు ఈ ఏడాది (2021) నోబుల్ శాంతి బహుమతి దక్కింది. తమ దేశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడినందుకు

Nobel Peace Prize 2021: జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్‌లకు నోబెల్ శాంతి బహుమతి
2021 Nobel Peace Prize
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 08, 2021 | 4:34 PM

2021 Nobel Peace Prize: జర్నలిస్టులు.. మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్‌లకు ఈ ఏడాది (2021) నోబుల్ శాంతి బహుమతి దక్కింది. తమ దేశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడినందుకు ఫిలిప్పీన్స్‌కు చెందిన మరియా రెస్సా.. రష్యాకు చెందిన దిమిత్రి మురతోవ్‌కు ఇవాళ ఈ బహుమతి ప్రకటించారు. వీరిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణకు, సుస్థిర శాంతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు చేసిన కృషికి ఈ అవార్డును అందుకోగలిగారని నార్వేజియన్ నోబెల్ కమిటీ అధ్యక్షురాలు బెరిట్ రీస్-ఆండర్సన్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం పరిరక్షణ, పత్రికా స్వేచ్ఛకు పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ వీరిద్దరూ ప్రతినిధులని నోబెల్ కమిటీ పేర్కొంది. రెస్సా, దిమిత్రి మురతోవ్ ఇద్దరూ సుస్థిర ప్రజాస్వామ్యానికి, చిరకాల శాంతికి భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమే పునాది అని బలంగా నమ్మి, ఆచరించారని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.

మారియా రెస్సా ఫిలిప్పినో – అమెరికన్ పాత్రికేయురాలు. సీఎన్ఎన్ ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటి చెప్పారు. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఓసారి అరెస్ట్ అయినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ముందుకు సాగారు.

ఇక, దిమిత్రి మురతోవ్ రష్యా జాతీయుడు. పాత్రికేయ రంగానికి చెందిన మురతోవ్ రష్యన్ దినపత్రిక నోవాయా గెజెటాకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ నోవాయా గెజెటాకు మంచి గుర్తింపు ఉంది.

Read also: VH: ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నా: వీహెచ్