AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VH: ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నా: వీహెచ్

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు

VH: ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నా: వీహెచ్
V Hanumantha rao
Venkata Narayana
|

Updated on: Oct 08, 2021 | 3:53 PM

Share

V Hanumantha Rao – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ మీడియా పాయింట్ దగ్గర ఇవాళ వీహెచ్ మాట్లాడారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలి. 2014 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదనడం సిగ్గుచేటు” అని వీహెచ్ అన్నారు.

దళిత బంధు పథకం కింద దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తానని చెప్పిన కేసీఆర్.. హుజురాబాద్ ఉపఎన్నిక తరువాత… 10 లక్షలు ఎప్పుడు ఇస్తానన్నాను.. అని అనినా అంటాడో ఏమో..! అని వీహెచ్ సందేహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో 54 శాతం మంది బీసీలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పారని వారి అభివృద్ధి దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. గవర్నర్ బతుకమ్మ సంబరాలల్లో పాల్గొని బతుకమ్మ ఆడటం చాలా సంతోషకరమని చెప్పిన వీహెచ్.. బతుకమ్మల మీద నుంచి కారు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. గవర్నర్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని వీహెచ్‌ హనుమంతరావు వెల్లడించారు.

Read also: Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!