Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!

రాజస్థాన్‌లో పాము కాటుతో హత్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇదో న్యూ ట్రెండ్‌లా మారిందని సీరియస్‌ అయింది సుప్రీంకోర్ట్‌. ఇలాంటి కేసుల్లో

Snake Bite Murders: రాజస్థాన్‌లో సర్వసాధారణంగా మారిపోయిన పాము కాటుతో హత్యలు.!
Snake Bite Murders
Follow us

|

Updated on: Oct 07, 2021 | 2:23 PM

Snake Bite Murders: రాజస్థాన్‌లో పాము కాటుతో హత్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇదో న్యూ ట్రెండ్‌లా మారిందని సీరియస్‌ అయింది సుప్రీంకోర్ట్‌. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్‌ ఇవ్వడం కూడా కుదరదని తేల్చి చెప్పారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. 2019లో రాజస్థాన్‌లోని జుంజుహూ జిల్లాలోని ఓ గ్రామంలో అత్తగారిని పాముతో కాటు వేయించి హతమార్చింది కోడలు. మృతురాలు సుభోద్‌దేవి కొడుకులిద్దరూ ఆర్మీలో పనిచేస్తుండగా..పెద్ద కొడుకు సచిన్‌కు 2018లో అల్పనాతో వివాహం జరిగింది. ఆ తర్వాత సచిన్‌తో పాటు మామగారు కూడా వేరే ప్రాంతంలో విధులకు వెళ్లిపోయారు. ఇంట్లో అత్తాకోడళ్లిద్దరే ఉండటంతో..పెళ్లైన 6 నెలలకే అల్పనా..మనీష్‌ అనే యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్తకు తెలియడంతో..ప్రియుడితో కలిసి ప్లాన్‌ చేసి ఆమెను పాముతో కాటు వేయించి హత్య చేయించింది. 2019 జూన్‌ 2న సుభోదేవి పాము కాటుతో చనిపోగా.. నెలన్నర తర్వాత కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి, కొన్ని ఆధారాలను అందించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్పనా కాల్ డేటాను పరిశీలించగా..సుబోధ్ దేవి చనిపోయిన మర్నాడు మనీశ్‌తో పాటు అతని స్నేహివతుడు కృష్ణ కుమార్‌తో చాలాసార్లు మాట్లాడినట్టు గుర్తించారు. అల్పనా, మనీష్, కృష్ణ కుమార్‌లు కలిసి 10వేల రూపాయలకు పామును కొనుగోలు చేసి హత్యకు కుట్ర పన్నినట్టు నిర్ధారణకొచ్చారు పోలీసులు..గతేడాది జనవరి 4 ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. పాముకాటుతో హత్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్‌ కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

Read also: Sri Krishna Jewellers: భారీ గోల్డ్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు తీవ్రం.. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షాపులన్నింటిలోనూ సోదాలు