East Godavari: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి

విశాఖ నుంచి తమిళనాడు మార్గంలో ఓ ఆటో వెళుతోంది. జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి మండలం బూరుగు పూడి వద్ద పోలీసులు సదరు ఆటోను తనిఖీ చేశారు. దేవుడి ఫోటోల బాక్స్‌లు కనిపించాయి. ఆ తర్వాత వాటిని విప్పతీసి చూడగా.. పోలీసుల కళ్లు బైర్లుగమ్మాయి.

East Godavari: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి
Ganja Smugglers Held
Follow us

|

Updated on: Oct 07, 2021 | 3:00 PM

గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు పెట్రేగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు పండ్ల లోడు మాటున.. ఆహార పదార్థాల మాటున.. పాల వ్యాన్లు లోపల… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రూపంలో గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు.. పోలీసులకు చిక్కారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఎవరూ ఊహించని రీతిలో బోర్‌వెల్ లారీలో గంజాయి తరలిస్తుండగా రీసెంట్‌గా పోలీసులు పట్టుకున్నారు.  తాజాగా అదే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజక వర్గం కిర్లంపూడి మండలం బూరుగు పూడి వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.

దేవుడి చాటున గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నంలో స్మగ్లర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దేవుళ్ల చిత్ర పటాలతో 5 చెక్క పెట్టెలతో ఉన్న ఓ ఆటో విశాఖపట్నం నుంచి తమిళనాడు వైపు వెళ్తోంది. అనుమానం వచ్చిన పోలీసులు ఆటోను ఆపి చెక్క పెట్టెలను చెకింగ్ చేయగా.. వాటిలో 122 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు 30 వేల రూపాయలు నగదు, ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సెల్వం అనే వ్యక్తి తమిళనాడు వాసి కాగా, రౌతుల పూడి మండలం శ్రుంగ వరం గ్రామానికి చెందిన గాది వెంకట రమణ మరొకరు అని పోలీసులు నిర్ధారించారు. తప్పించుకునేందుకు గంజాయి స్మగ్లర్లు అనుసరిస్తున్న మార్గాలు పోలీసులకే విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

Also Read: లఖింపుర్‌ ఖేరి ఘటనపై విచారణ రేపటికి వాయిదా.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..