YouTube: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. యూ ట్యూబ్ చూసి ఆ పని చేద్దామనుకున్నాడు.. కానీ..

మనకు ఏదైనా తెలియనప్పుడు తెలిసిన వారిని అడుగుతాం. వారు అందుబాటులో లేకుంటే వారు వచ్చే వరకు వేచి చూస్తాం. కానీ ఈ ఇంటర్నెట్ వచ్చినప్పుటి నుంచి మనకు ఏ సందేహం వచ్చినా నెట్‎లో వెతుకుతున్నాం...

YouTube: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. యూ ట్యూబ్ చూసి ఆ పని చేద్దామనుకున్నాడు.. కానీ..
Youtub1
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 07, 2021 | 5:06 PM

మనకు ఏదైనా తెలియనప్పుడు తెలిసిన వారిని అడుగుతాం. వారు అందుబాటులో లేకుంటే వారు వచ్చే వరకు వేచి చూస్తాం. కానీ ఈ ఇంటర్నెట్ వచ్చినప్పుటి నుంచి మనకు ఏ సందేహం వచ్చినా నెట్‎లో వెతుకుతున్నాం. ఇప్పుడు యూట్యూబ్ చూసి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే ఇదీ మంచికైతే ఫర్వాలేదు. కానీ చెడుకైతే.. అవును కొందరు యూట్యూబ్‎లో చూసి ఎలా దొంగతనం చేయాలి, ఎలా దొంగ నోట్లు ప్రింట్ చేయాలి, అబార్షన్ ఎలా చేసుకోవాలి అనే వీడియోలు చూసి చేసేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్ చూసి ఏటీఎంలో డబ్బులు నొక్కేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ చివరికి కథ అడ్డం తీరిగింది.

ఆంధ్రప్రదేశ్‎లోని విశాపట్నం జిల్లా అనకాపల్లి ఎల్ఎన్‎నగర్‎కు చెందిన మోహన్ తాగుడుకు బానిసయ్యాడు. దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెవటంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఎలా అని ఆలోచిస్తున్న అతడికి యూట్యూబ్ చూస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. బ్యాంకులో దొంగతనం చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. మరి చోరీ ఎలా చేయాలి.. అనుకుంటూ.. యూట్యూబ్‎లో ఏటీఎంలో దొంగతన చేయడం ఎలా అని సెర్చ్ చేశాడు. వచ్చిన వీడియోలను చూశాడు. అందులో సులభంగా, పోలీసులకు దొరక్కకుండా చోరీ చేసే వీడియో ప్రకారం చేయాలనుకున్నాడు. ఇక పని ప్రారంభించాడు.

ప్రణాళిక రచించి.. అనకాపల్లిలోని పెరుగుబజార్ వద్ద ఉన్న యూనియన్ బ్యాంకు సెక్యూరిటీ గార్డు డబ్బు ఆశ చూపి తనతో రావాలని కోరాడు. దీనికి అతడు ఒప్పుకున్నాడు. ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే గ్యాస్ సిలిండర్లు, కట్టర్, గునపం కావాలి. వీటన్నింటిని వారు సమకూర్చుకున్నారు. ఇద్దరు కలిసి గుండాల వద్ద ఏటీఎం చోరీ చేయాలని డిసైడ్ అయ్యారు. రాత్రి అక్కడికి చేరుకుని ముందుగా మెయిన్ డోర్, సీసీ కెమెరాలను పగులగొట్టారు. గ్యాస్ సిలిండర్లు, కట్టర్, గునపంతో ఏటీఎం మెషీన్ తెరవాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి తరం కాలేదు. దీంతో చేసేదిలేక తెచ్చుకున్న సామగ్రిని అక్కడే వదిలి పారిపోయారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని 24 గంటల్లో ట్రాక్ చేసి పట్టుకున్నారు. ప్రసాద్తో పాటు అతనికి సహకరించిన రామును కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు.

Read Also..  King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకుని డ్యాన్స్ చేసిన వ్యక్తి.. చివరికి ఊహించని ట్విస్ట్..