Childhood Photo: జయా బచ్చన్ చేతిలో ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో గుర్తు పట్టారా..!

Surya Kala

Surya Kala |

Updated on: Oct 08, 2021 | 7:35 PM

Childhood Photo: బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్ భార్య జయాబచ్చన్ చేతిలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నరి బాలుడు ఎవరో గుర్తు పట్టారా..

Childhood Photo: జయా బచ్చన్ చేతిలో ఉన్న ఈ చిన్నారి బాలుడు ఎవరో గుర్తు పట్టారా..!
Sharukh Son

Follow us on

Childhood Photo: బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్ భార్య జయాబచ్చన్ చేతిలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నరి బాలుడు ఎవరో గుర్తు పట్టారా.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. అవును తండ్రి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సిన సమయంలో డ్రగ్ కేసులో అరెస్ట్ అయి అత్యంత వివాదాస్పదంగా అందరికీ పరిచయమయ్యాడు.  ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆర్యన్ గురించి వెదుకుతున్నారు. ఆర్యన్ చదువు, స్నేహితులు వంటి అనేక విషయాలను సెర్చ్ చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ గౌరీ ల తొలి సంతానం ఆర్యన్. 1997 నవంబర్ 13న జన్మించాడు.  ఆర్యన్ ఖాన్ చిన్నతనంలో తండ్రి నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ మూవీలో బాలనటుడిగా అతిధి పాత్రలో నటించాడు.  ఆ సినిమాలో చిన్నప్పటి రాహుల్ (షారుఖ్ ఖాన్) గా కనిపించాడు. ఈ ఫొటోలో రాహుల్ సవతి తల్లిగా నటించిన జయాబచ్చన్ చేతిలో ఉన్న చిన్న రాహుల్ ఆర్యన్ ఖాన్.

లండన్‌లోని సెవెన్ ఓక్స్ పాఠశాలలో ఆర్యన్ విద్యాభ్యాసం  పూర్తి చేసిన ఆర్యన్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలీఫోర్నియానుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. దర్శకత్వం పై ఇష్టమున్న ఆర్యన్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్, స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టా పుచ్చుకున్నాడు. ఇక  ‘హమ్ లజవాబ్ హైన్’ సినిమాలో తేజ్ పాత్రకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పాడు. అంతేకాదు ‘లయిన్ కింగ్’ హిందీ వెర్షన్‌లో  ముఫాషా పాత్రకు షారూక్ డబ్బింగ్ చెప్పగా.. సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇక అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందా..  ఆర్యన్ లు ఇద్దరూ డేటింగ్ అంటూ అప్పట్లో ఓ రేంజ్ లో హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై తాము ఇద్దరం మంచి స్నేహితులం.. ఏ బంధం లేదంటూ ఇద్దరూ స్పదించారు

Also Read:  అలసటగా ఉంటుందా.. నిద్ర సరిగ్గా పట్టడంలేదా ఇలా స్నానం చేసి చూడండి..

యువరాజ్‌ బయోపిక్‌కు సర్వం సిద్ధం చేస్తోన్న కరణ్‌ జోహర్‌.. యూవీగా నటించబోయేది ఎవరో తెలుసా.?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu