King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకుని డ్యాన్స్ చేసిన వ్యక్తి.. చివరికి ఊహించని ట్విస్ట్..

పాములు పట్టేవాళ్లు జాగ్రత్తలు తీసుకుని పాములు పడతారు. పాములు పట్టేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. దాని కాటుకు బలి కావాల్సిందే. ఇలాంటి ఘటనే అస్సాంలో జరిగింది.

King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా.. పట్టుకుని డ్యాన్స్ చేసిన వ్యక్తి.. చివరికి ఊహించని ట్విస్ట్..
Snake
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 07, 2021 | 2:23 PM

ఓ వ్యక్తి అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో పాము అతడిని కాటు వేసింది. గమనించిన చుట్టు పక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

అస్సాంలోని కచార్ జిల్లా బిష్ణుపూర్ గ్రామంలో వరి పొలంలోకి 14 అడుగుల పొడువైన కింగ్ కోబ్రా వచ్చింది. భయపడిన వారు పాములు పట్టే రఘునందన్ భూమిజ్ అనే 60 వ్యక్తికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి వచ్చిన అతడు కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దానిని గ్రామంలోకి తీసుకొచ్చి అందరికి చూపించాడు. తన చుట్టు పామును చుట్టుకుని డ్యాన్స్ చేశాడు. గ్రామస్థులు మాత్రం ఆశ్చర్యంగా పామును చూస్తూ ఉండిపోయారు.

అయితే అతను నిర్లక్ష్యంగా కింగ్ కోబ్రాను పట్టుకుని డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో పాము అతడిని కాటు వేసింది. కాటు వేసిన క్షణాల్లో అతడు కిందపడిపోయాడు. గమనించిన గ్రామస్థులు అతడిని ఆస్పత్రికి తరలించారు. భూమిజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భూమిజ్ తన జీవితంలో ఎన్నో పాములు పట్టాడు. అటవీ శాఖ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పామును రక్షించి అడవి ప్రాంతంలో వదిలివేసింది. రఘునందన్ భూమిజ్ పామును పట్టి దానితో డ్యాన్స్ చేయడాన్ని గ్రామస్థుల్లోని కొందరు తమ మొబైల్స్‎లో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Read Also.. Viral Video: ఇతని జీవితం అందరికి స్పూర్తిదాయకం.. కళ్లు లేకున్నా స్వయం ఉపాధితో అందరికి ఆదర్శంగా..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!