AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇతని జీవితం అందరికి స్పూర్తిదాయకం.. కళ్లు లేకున్నా స్వయం ఉపాధితో అందరికి ఆదర్శంగా..

సాధించాలని అనే కసి.. పని పట్ల అంకితాభావం.. ఉంటే ఎప్పటికైనా విజయం సాధిస్తాం. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అలసిపోకుండా

Viral Video: ఇతని జీవితం అందరికి స్పూర్తిదాయకం.. కళ్లు లేకున్నా స్వయం ఉపాధితో అందరికి ఆదర్శంగా..
Viral News
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2021 | 1:46 PM

Share

సాధించాలని అనే కసి.. పని పట్ల అంకితాభావం.. ఉంటే ఎప్పటికైనా విజయం సాధిస్తాం. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అలసిపోకుండా విసుగుచెందకుండా శ్రమిస్తే.. ఫలితం తప్పకుండా వస్తుంది. ఓడిపోతేనే.. గెలుపు ఎంత బాగుంటుందో తెలుస్తుంది. గెలవాలనే తపన, కసి పెరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితం పూలపాన్పు కాదు.. ప్రతి దారిలోనూ అడ్డుగా వచ్చే ముళ్లకంచెలు.. వాటిని తెలివితో కాస్త శ్రమించి పక్కన పెడితే గమ్యం సుగమం.. శరీరానికి అలసట కలిగించకుండా.. గమ్యాన్ని చేరాలంటే.. ఎప్పటికైనా ముళ్ళదారిగానే మిగిలిపోతుంది. ఈ విషయాలను సైతం ఓ అంధుడు నిరుపిస్తున్నాడు. తాను ఎంచుకున్న జీవనవృత్తి కారణంగానే కంటి చూపును పోగొట్టుకున్నాడు. కానీ ఏమాత్రం నిరాశ చెందకుండా.. తాను చేపట్టిన పనిని మాత్రం వదలకుండా.. స్వయం ఉపాధితో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నాసిక్‏లోని మఖ్మలాబాద్ రోడ్డులో ఒక చిన్న అరటి చిప్స్ షాప్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి అరటిని ఎంతో వేగంగా ముక్కలుగా కట్ చేస్తూ.. నూనెలో వేయిస్తున్నాడు. ఆ అరటి చిప్స్ వేగిన తర్వాత వాటిని వేగంగా పైపింగ్ హాట్ చిప్‏లను మరోక కంటైనర్‏లోకి మార్చేశాడు. ఆ తర్వాత మరో యువకుడు వాటికి కాస్త్ కారం అద్ది ప్లాస్టిక్ కవర్‏లో ప్యాక్ చేస్తున్నాడు. అయితే అరటి చిప్స్ వేస్తున్న వ్యక్తికి కళ్లు కనిపించవు.. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేయడం వలన అతనికి నూనె వేడికి కళ్లు కనిపించకుండా జరిగింది. ఇక ఆ వృద్ధుడు అరటి చిప్స్ వేస్తున్న విధానాన్ని వీడియో తీసి.. సంస్కర్ అనే ఇన్‏స్టా యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ… ఆ వృద్ధుడి కంటి చికిత్సకు విరాళాలు సేకరిస్తున్నాడు. నాసిక్‏లో మీకు ఎవరైనా తెలిస్తే.. ఆ వృద్ధుడి దగ్గర అరటి చిప్స్ కొనాలని కోరుతూ.. తన కంటి చూపును తిరిగి ఇచ్చేందుకు మనమందరం కలిసి సహయపడాలంటూ పోస్ట్ చేశారు.

Also Read: Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

Sivakarthikeyan: తెలుగు నేర్చుకుంటున్న తమిళ్ స్టార్ హీరో… అసలు విషయం చెప్పేసిన శివకార్తికేయన్..