Healthy Heart: ఆరోగ్యకరమైన హృదయానికి 5 ఆయుర్వేద మూలికలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Healthy Heart: శరీరంలో ముఖ్యమైన భాగం గుండె. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందించే రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని...

Healthy Heart: ఆరోగ్యకరమైన హృదయానికి 5 ఆయుర్వేద మూలికలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Healthy Heart
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 07, 2021 | 2:22 PM

Healthy Heart: శరీరంలో ముఖ్యమైన భాగం గుండె. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందించే రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి గుండె పనితీరు సమర్థవంతంగా ఉండటం అవసరం. ఆహారం, మూలికా మందులు, వ్యాయామం, ధ్యానం.. హృదయం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు.. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు కీలకంగా వ్యవహరిస్తాయి. మరి ఆ కీలకమైన మూలికా పదర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అర్జున చెట్టు.. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అర్జున చట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అర్జున బెరడు పొడి గుండెకు మేలు చేస్తుంది. ఇది హార్ట్ టానిక్‌గా పనిచేస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. అధిక రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడే యాంటీ-హైపర్‌టెన్సివ్ లక్షణాన్ని కూడా కలిగి ఉంది.

అమలకి.. అమలకి ని వాడుకలో ఆమ్లా అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్, అనాల్జేసిక్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంది. ఆయుర్వేద సాహిత్యంలో కాలేయం, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ అల్సర్, మధుమేహం వంటి అనేక ఇతర సమస్యల బాధపడే వారికి ఆమ్లా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆమ్లా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మొరింగ.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మరో మూలిక మొరింగ. ఇది కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. మొరింగాను మునగ చెట్టు అని కూడా అంటారు. దీని ఆకులు, కాయలు, పువ్వులు శతాబ్దాలుగా భారతీయ ఇళ్లలో ఉపయోగించబడుతున్నాయి. మొరింగ ఆకులను కొన్ని ఆఫ్రికన్ దేశాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది గుండెకు మేలు చేస్తుంది.

అవిసె గింజలు.. అవిసె గింజలు.. గుండె జబ్బుల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చాలా సందర్భాలలో గుండె జబ్బుల నివారణకు కారణమవుతుంది.

పసుపు.. పసుపులో కర్కుమిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కర్కుమిన్ కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవే కాకుండా అనేక మూలికలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతాయి. అలాంటి వాటిలో బ్రాహ్మీ, తులసి, అశ్వగంధ వంటి ఇతర మూలికలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిపుణులు చెబుతున్నారు.

Also read:

‘ధరలు తగ్గించండి ఉయ్యాలో’.. గ్యాస్ సిలిండర్లతో ప్రజల వినూత్న నిరసన.. అస్త్రంగా మలుచుకున్న టీఆర్ఎస్..

Astro Remedies for Career: కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలా? అయితే ఈ జ్యోతిష్య చిట్కాలు పాటించండి..

Viral News: 50 ఏళ్లుగా పచ్చి మాంసమే తింటున్నాడు.. సడెన్‌గా విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..