Anjeer for Weight Loss: బరువు వేగంగా తగ్గాలని అనుకుంటున్నారా? అయితే.. అంజీర్‌తో ప్రయత్నించండి..
ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం పోరాడుతున్నారు. నెయ్యి-నూనె ఆహారం లేకుండా కూడా ఉడికించిన వివిధ ఆహారాలు తినడం ద్వారా బరువు తగ్గించుకోవడం కోసం విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు.
Anjeer for Weight Loss: ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం పోరాడుతున్నారు. నెయ్యి-నూనె ఆహారం లేకుండా కూడా ఉడికించిన వివిధ ఆహారాలు తినడం ద్వారా బరువు తగ్గించుకోవడం కోసం విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మీరు బరువు తగ్గడానికి మీ రెగ్యులర్ డైట్‌లో తక్కువ కొవ్వు అదేవిధంగా కేలరీలు అధికంగా ఉండే ఆహ్లాదకరమైన, రుచికరమైన ఆహారాలను జోడించగలిగితే ఎలా ఉంటుంది?ఇటువంటి విధానంతో బరువు తగ్గగలుగుతారు. అలాగే వారి మానసిక స్థితి కూడా బాగుంటుంది. దీని కోసం, బరువు తగ్గడానికి కొన్ని తీపి, సంతృప్తికరమైన పండ్లను మీ ఆహారంలో చేర్చవచ్చు. కాబట్టి అత్తి పండ్లు (అంజీర్) బరువు తగ్గించడంలో ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం …
• ఒక పెద్ద ముడి అంజీర్ 2,000 కేలరీల ఆహారం ఆధారంగా 1.9 గ్రాముల డైటరీ ఫైబర్‌ను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా సహాయపడుతుంది. మీరు మీ అల్పాహారంలో అధిక ఫైబర్ తృణధాన్యాలు, అంజీర్ పండ్ల ముక్కలను జోడించవచ్చు లేదా పాలకూర- చికెన్ సలాడ్‌కి చిన్న ముక్కలు అంజీర్ కూడా జోడించవచ్చు.
• అలాగే ఒక పెద్ద అంజీర్‌లో 47 కేలరీలు ఉంటాయి. అంజీర్ పండ్లను తినడం ద్వారా మీ కేలరీల వినియోగాన్ని తగ్గించడం వల్ల మీరు బరువు తగ్గవచ్చు. ఇది కాకుండా, అంజీర్‌ను చిరుతిండిగా తీసుకోవడం వల్ల మీకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వలన ఇది అనవసరమైన క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
• మీరు ఎండిన అంజీర్ పండ్లను లేదా ప్రాసెస్ చేసిన అంజీర్ ఉత్పత్తులను కాకుండా తాజా అత్తి పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఎండిన అత్తి పండ్ల కంటే తాజా అత్తి పండ్లలో తక్కువ కేలరీలు.. తీపి ఉంటుంది. మీరు ఎండిన లేదా ప్రాసెస్ చేసిన అంజీర్ పండ్లను తింటే, బరువు తగ్గడానికి ఇది తప్పు ఎంపిక కావచ్చు, ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇందులో పోషకాలు తక్కువగా ఉంటాయి. అధిక కేలరీలు ఉంటాయి. అదనంగా, ప్రాసెస్ చేయబడిన ఫిగ్-బార్‌లు తాజా అంజీర్ పండ్ల కంటే ఎక్కువ కేలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి రెండు కుకీలలో 198 కేలరీలు లేదా 26 గ్రాముల చక్కెర వరకు జోడిస్తాయి.
• మీరు స్వీట్లు తినడం అంటే ఇష్టం ఉంటే, మీరు అంజీర్ ను స్వీట్లు స్థానంలో తినవచ్చు. దీని కారణంగా అత్తి పండ్ల తీపి రుచి, చక్కెర వల్ల పెరిగిన ఊబకాయం నివారించేందుకు పనిచేయగలదు. మీరు బరువు తగ్గాలనుకుంటే, తీపి పండ్ల పైస్ లేదా కాల్చిన ఆహారాలకు ప్రత్యామ్నాయంగా అంజీర్ పండ్లను ఎంచుకోవడం మంచిది.
Also Read: Varun Gandhi: బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు
Passenger Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు