Passenger Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు
Passenger Trains: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని..
Passenger Trains: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రకటించారు. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సంస్థ మళ్ళీ సాధారణ రైళ్లను పునరుద్ధరించడానికి రెడీ అవుతుంది.
బుధవారం గజానన్ మాల్యా వర్చువల్ గా మీడియాతో మా ట్లాడుతూ.. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం కాజీపేట్‌లో వ్యాగన్ వర్క్‌షాపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 55 ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు నడుస్తున్నాయని.. త్వరలోనే మరో 30 సర్వీసులను పునఃప్రారంభిస్తామని తెలిపారు.
అయితే రైళ్లలోప్రయాణించే ప్రయాణానికులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరోసారి సూచించారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలనిచెప్పారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోలని తెలిపారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున రైల్వే స్టేషన్లు, రైళ్లలో కొవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయనున్నామని తెలిపారు. మొత్తం మీద దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో త్వరలో సాధారణ రైళ్లు పట్టాలు లెక్కనున్నాయి.
Also Read: తీరాన్ని అనుకుని పయనిస్తున్న ఉపరితల ద్రోణి.. ఏపీలో రాగల మూడురోజుల్లో వర్ష సూచన