Varun Gandhi: బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ , ఆయన తల్లి మేనకాగాంధీని తొలగించారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా గత కొంతకాలంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు వరుణ్‌గాంధీ.

Varun Gandhi: బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు
Maneka Gandhi, Varun Gandhi
Follow us

|

Updated on: Oct 07, 2021 | 3:28 PM

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ , ఆయన తల్లి మేనకాగాంధీని తొలగించారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా గత కొంతకాలంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు వరుణ్‌గాంధీ. ఉత్తరప్రదేశ్‌ లోని లఖీంపూర్‌ ఖేరి హింసాకాండపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ కూడా హత్యలతో నోళ్లు మూయించలేరు అంటూ ట్వీట్‌ చేశారు వరుణ్‌గాంధీ. వరుణ్‌గాంధీతో పాటు మేనకాగాంధీ ఉత్తరప్రదేశ్‌ నుంచి లోక్‌సభ ఎంపీలుగా బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొత్తగా జ్యోతిరాధిత్యా సింధియాకు , నటుడు మిథున్‌ చక్రవర్తికి చోటు లభించింది.

తీవ్ర చర్చనీయాంశమైన వరుణ్ గాంధీ ట్వీట్

రోడ్డుపై ప్రదర్శనగా వెళ్తున్న రైతులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్న వీడియోను బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం గురువారం ట్వీట్‌ చేశారు. ‘ఈ వీడియో క్లారిటీగా ఉంది. హత్యల ద్వారా నిరసనకారుల నోరు మూయించలేం. చిందిన అమాయక రైతుల రక్తానికి సమాధానం అవసరం. రైతుల మనస్సుల్లో అహంకారం, క్రూరత్వం మొలకెత్తక ముందే న్యాయం చెయ్యాలి’ అని ఆయన పేర్కొన్నారు. 

రెండు రోజుల క్రితం కూడ వరుణ్ గాంధీ ఇదే తరహా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ‘ఈ దృశ్యాలు ఎవరి మనసునైనా కదిలిస్తాయ’ని రాసుకొచ్చారు. వీడియో ఆధారంగా వాహనాల ఓనర్స్, అందులో కూర్చున్న వ్యక్తులు, ఘటనతో సంబంధం ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఇటీవల రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కాన్వాయ్‌‌తో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ఘటనల్లో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తలను రేకెత్తించింది.

Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ