‘రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే’.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్

CM KCR: పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

'రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే'.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
Cm Kcr


పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా..ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడుగా ఈ మాట చెబుతున్నానని సీఎం వెల్లడించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ.. అక్కడి నుంచి వచ్చేవి తక్కువని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులు కాపాడుకోడానికి కేంద్రంతో పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ తనకు లేఖ రాసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాల అధికారులను కేంద్రం లాక్కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాల్సి వస్తే కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామని సీఎం చెప్పారు.

ప్లాన్ యువర్ విలేజ్ పేరుతో  తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో చేర్చేందుకు ‘మన దగ్గర ఒప్పుకోరు- కోర్టుకు వెళ్తార’ని సీఎం అన్నారు. పల్లె- పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా 2లక్షల 33వేల పోల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.  గతంలో బోరుబావుల్లో పిల్లలు పడి మృత్యువాత పడేవారని.. గడిచిన ఏడాదిన్నర నుంచి బోరుబావుల్లో పిల్లలు పడ్డ ఘటనలు జరగడం లేదని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోరుబావులను పూర్తిగా మూసి వేయించినట్లు తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతీ గ్రామానికి పంచాయితీ సెక్రటరీని పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వాలు చెట్లు పెట్టలేదు- అభివృద్ధి చెయ్యలేదు ఇప్పుడు తాము రెండూ చేస్తున్నామని సీఎం అన్నారు. కరోనా వల్ల లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని.. మహమ్మారి రాకపోతే రాష్ట్రం అభివృద్ధి బాగా ఉండేదని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరమని.. ఐదు మెగా మెట్రో నగరాల్లో మన భాగ్యనగరం ఒకటని సీఎం వెల్లడించారు.

Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి

పెట్రోల్ బంక్‌లపై దాడులు.. విస్తుపోయే నిజాలు.. మిమ్మల్ని నిలబెట్టి దోచేస్తున్నారు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu