Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating: పెట్రోల్ బంక్‌లపై దాడులు.. విస్తుపోయే నిజాలు… మిమ్మల్ని నిలబెట్టి దోచేస్తున్నారు

మీరు.. బంకుల్లో పెట్రోల్, డిజిల్ పోయించుకుంటున్నారా..? కొట్టించుకున్న పెట్రోల్‌కు రావాల్సిన మైలేజ్ రావడం లేదా..? అయితే మీరు మోసపోతున్నట్లే.

Cheating: పెట్రోల్ బంక్‌లపై దాడులు.. విస్తుపోయే నిజాలు... మిమ్మల్ని నిలబెట్టి దోచేస్తున్నారు
Petrol Pumps Cheating
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2021 | 5:46 PM

మీరు.. బంకుల్లో పెట్రోల్, డిజిల్ పోయించుకుంటున్నారా..? కొట్టించుకున్న పెట్రోల్‌కు రావాల్సిన మైలేజ్ రావడం లేదా..? డౌట్ వస్తున్నా.. పెట్రోల్ పొయించుకుని వెళ్లిపోతున్నారా.. ? ఐతే.. మిమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నారు పెట్రోల్ బంక్‌లను రన్ చేసే కొందరు కేటుగాళ్లు. పెట్రోల్ బంక్‌ మిషనల్లో మైక్రో చిప్స్ అమర్చి.. పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. స్టాప్‌ వేర్ మార్చి.. అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇలా మూడు రాష్ట్రాల్లో మోసాలు చేస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మొత్తంగా.. 34 పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్స్ పెట్టి మోసాలకు పాల్పడ్డరన్నారు పోలీసులు. గతంలో పనిచేసిన అనుభవం..ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశ్యంతో మిషన్ ట్యాంపరింగ్ చేస్తున్నారన్నారు బాలానగర్ డీసీపీ పద్మజ. లీటర్‌కు 30ML, 50ML తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి.. కస్టమర్లకు తక్కువగా వచ్చేలా చేస్తున్నారన్నారు. ఈ ముఠాపై 6 కేసులు నమోదు చేశామన్నారు బాలానగర్ డీసీపీ. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి… మిగతా బంకుల్లో కూడా తనిఖీలు చేపడతామన్నారు.

ఈ రకమైన తప్పుడు కొలతలతో వినియోగదారులకు జేబులకు చిల్లు పెడుతున్నారు బంకుల యాజమాన్యాలు. టెక్నాలజీ టాంపరింగ్ తో మోసాలకు పాల్పడుతున్నారు బంక్ ఓనర్స్. మైక్రో చిప్ లు అమర్చి మన కళ్ల ముందే మనకు తెలియకుండా పెట్రోల్ ను కొట్టేస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. ఓవైపు పెట్రో ధరలతో కుదేలవుతుంటే.. ఇలాంటి మోసాలు తమను మరింత ఇబ్బంది పెడుతున్నాయని వాపోతున్నారు. మరోసారి ఇలాంటి ఛీటింగ్ చేయకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఎంపీ వరుణ్‌గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ తొలగింపు