Pawan Kalyan: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఫోకస్..ఈనెల 9న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్న జనసేనాని

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని..

Pawan Kalyan: తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఫోకస్..ఈనెల 9న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్న జనసేనాని
Pawan Kalyan
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2021 | 9:32 PM

Janasena-Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని ఈ నెల 9న నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఈ సమావేశాన్ని జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్ లోని జె. పి. ఎల్. కన్వెన్షన్ లో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ కియాశీలక సమావేశంలో సభ్యులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. తెలంగాణ పార్టీని ముందుకు తీసుకెళ్లడం సంస్థాగత నిర్మాణం, ప్రజా పక్షాన నిలిచి పోరాడడంపై కార్యకర్తలకు నాయకులు దిశానిర్ధేశం చేయనున్నారు.

పార్టీ నిర్మాణంలో భాగంగా తెలంగాణాలో క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకం సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలోని కిర్యశీలక సభ్యులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఓ నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణాలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు.

Also Read:  అరుదైన జీవి ‘సింహం చేప’.. అందంగా ఉందని పట్టుకుంటే పక్షవాతం.. విషం చిమ్మితే మరణం..