AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lion Fish: అరుదైన జీవి ‘సింహం చేప’.. అందంగా ఉందని పట్టుకుంటే పక్షవాతం.. విషం చిమ్మితే మరణం..

Lion Fish: సర్వసాధారణంగా సముద్రంలో నివసించే జీవులు అనేక రకాలు. చేపలు రొయ్యలు పీతలు ఆక్టోపస్ వంటివాటిని మనిషి ఆహారంగా..

Lion Fish: అరుదైన జీవి 'సింహం చేప'.. అందంగా ఉందని పట్టుకుంటే పక్షవాతం.. విషం చిమ్మితే మరణం..
Lion Fish
Surya Kala
|

Updated on: Oct 07, 2021 | 3:46 PM

Share

Lion Fish: సర్వసాధారణంగా సముద్రంలో నివసించే జీవులు అనేక రకాలు. చేపలు రొయ్యలు పీతలు ఆక్టోపస్ వంటివాటిని మనిషి ఆహారంగా తీసుకుంటే.. కొన్ని రకాల డాల్ఫిన్స్ ను, చేపలను అక్వేరియం లో పెట్టుకుని పెంపుడు జంతువులుగా మచ్చిక చేసుకుంటారు. అయితే త్రిమింగళం వంటి జీవి మనిషిని చంపి ఆహారంగా తీసుకుంది.. అయితే ఓ చేప చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ చేప అత్యంత విషపూరితమైంది. తనకు ఏదైనా ఆపద ఎదురైతే.. విషం చిమ్మి తమను తాము రక్షించుకుంటాయి. వీటిని సింహం చేపలు అని అంటారు. ఇవి తాజాగా యూకేలో వీలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే..

యూకేలో లయన్ ఫిష్ అనే చేపలు వెలుగులోకి వచ్చాయి. ఇవి కలర్ ఫుల్ గా అందంగా  ఆరు అంగుళాల పొడవు మాత్రమే ఉండే ఈ విషపు చేప చెసిల్ బీచ్ లో తన తండ్రితో కలిసి చేపలు పడుతున్న 39 ఏళ్ల వ్యక్తి గుర్తించాడు. దీన్ని లయన్ ఫిష్ అని పిలుస్తారు. అందంగా ఉన్నాయని ఎవరైనా వాటిని పట్టుకోవాటానికి గనుక వెళ్ళితే.. ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే తమకు ఆపద వస్తున్నది అని భావిస్తే.. వెంటనే ఈ లయన్ ఫిష్ తమలో ఉన్న విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి. అంట డేంజరస్ చేపలు అన్నమాట ఇవి.

సింహం చేప విషం మనిషి శరీరానికి తగిలితే.. వెంటనే శరీరం పనిచేయకుండా చచ్చుబడిపోతుంది. పక్షవాతం వచ్చినట్లు కాళ్ళు చేతులు పనిచేయకుండా అవుతాయి. చేప విషం మనిషి శరీరానికి తగిలితే అంతే.. వెంటనే చచ్చుబడిపోతుంది. కాళ్లు, చేతులు పనిచేయవు.. పక్షవాతం వస్తుందట.. అంతేకాదు.. తాకిన చోట ప్రదేశంలో భరించలేని నొప్పి వస్తుందట. ఎర్రగా కందిపోతుందట.. అక్కడ వాచిపోయి క్రమంగా పెరాలిసిస్ కు దారితీస్తుంది. విష ప్రభావం ఎక్కువగా ఉంటే..కొన్ని సార్లు మరణిస్తారట.

ఆ అరుదైన విషపు చెప్పాను గుర్తించిన వెంటనే అతడు స్థానిక బయాలజిస్టులకు చెప్పాడు. అంతేకాదు.. తనకు ఇంకా జీవించే అదృష్టం ఉందికనుక తనపై ఆ సింహం చేప దాడి చేలేదని.. అందుకనే ఇంకా తాను ప్రాణాలతో బతికి ఉన్నానని చెప్పాడు. ఈ చేప ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందినది. ఈ డేంజరస్ చేపలకు రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. . జెబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ ఫ్లై కాడ్ లాంటి పేర్లతో పిలుస్తారు.

Also Read:  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు..