Ndakasi: కాపాడిన వ్యక్తి ఒడిలోనే కన్నుమూసింది.. సోషల్ మీడియా స్టార్ గొరిల్లా ఎండకశి మృతి..
Social media star mountain Gorilla Ndakasi: 2019 లో ఒక చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒకే ఒక్క ఫొటోతో గొరిల్లా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. అదే సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ
Social media star mountain Gorilla Ndakasi: 2019 లో ఒక చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఒకే ఒక్క ఫొటోతో గొరిల్లా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. అదే సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా చనిపోయినట్లు కాంగో విరుంగ నేషనల్ పార్క్ నిర్వాహకులు వెల్లడించారు. 2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా తీసిన సెల్ఫీకి ఎండకశి సీరియస్‌గా ఫోజు ఇచ్చింది. అయితే.. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్‌గా మారింది. ఇది మామూలు ఫోజ్ కాదంటూ నెటిజన్లు ఎండకశికి సోషల్ మీడియా స్టార్‌గా అభివర్ణించారు. దాని మీద ఎన్నో కథనాలు, డాక్యుమెంటరీలు, మీమ్స్ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
అయితే.. చివరకు ఎండకశి పద్నాలుగేళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసినట్లు పార్క్ నిర్వాహకులు వెల్లడించారు. దానిని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోతో విరుంగా నేషనల్ పార్క్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి సెప్టెంబర్ 26 చనిపోయిందని.. అది కూడా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కేర్ టేకర్ ఒడిలో మృతి చెందినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంగో విరుంగ నేషనల్ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్‌లో ఎండకశి ఇంతకాలం పెరిగింది. అయితే.. ఈ సెంటర్‌లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలేనని నిర్వాహకులు వెల్లడించారు. విరుంగ నేషనల్ పార్క్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నివసించే గొరిల్లాలను.. మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ సమయంలో తల్లి కళేబరం మీద ఉన్న నెలల వయసున్న పిల్ల గొరిల్లాని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడాడు. అప్పటి నుంచి దాని ఆలనా పాలనా చూసుకుంటూ వస్తున్నాడు.
It is with heartfelt sadness that Virunga announces the death of beloved orphaned mountain gorilla, Ndakasi.
C’est avec une profonde tristese que Virunga annonce le décès du gorille de montagne orpheliné Ndakasi.https://t.co/GdkJbhWESz pic.twitter.com/bsCKdEq8tB
— Virunga NationalPark (@gorillacd) October 5, 2021
అనంతరం కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. దీంతో 2007లో 720 ఉన్న కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు 1,063కి చేరిందని గణాంకాలు తెలుపుతున్నాయి.
Also Read: